జనాల్లోకి జనసేన



Want create site? Find Free WordPress Themes and plugins.
    ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీల అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి. పార్టీ సభ్యత్వాలతో పాటు పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురేయడంతో పాటు…వారికి పార్టీ గుర్తును ఇస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కుటుంబం పేరుతో జగన్ పార్టీ జనాల్లోకి వెళుతోంది. నవరత్నాలతో ప్రచారం చేస్తోంది. 
       ఇలాంటి సమయంలో జనసేన ఊరుకోడం లేదు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబోతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై పార్టీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష జరిపారు. పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ సాంకేతిక వివరాలను జనసేన ఐటీ విభాగం నిపుణులు పవన్‌కు తెలిపారు. యాప్ లో చేయాల్సిన మార్పులను, చేర్పులను సూచించారు. జనసేన ఐటీ విభాగం రూపకల్పన చేసిన సభ్యత్వ నమోదు సాఫ్ట్‌వేర్‌, యాప్‌లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను పలుమార్లు పరిశీలించిన తర్వాత పవన్‌కి చూపించినట్లు ఐటీ నిపుణులు చెప్పారు. త్వరలోనే ఆన్ లైన్లో పార్టీ కార్యకర్తలంతా సభ్యత్వం తీసుకునేలా ప్రకటన చేయనున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న సమయంలో జనసేన వీలున్నంత తొందరగానే ఈ పని చేసేందుకు సిద్దమవుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*