బిగ్ బాస్ లో సందడి చేసిన జై లవకుశ టీమ్



Want create site? Find Free WordPress Themes and plugins.
        బిగ్ బాస్ షోలో జై లవకుశ టీమ్ సందడి చేసింది. జై, లవ, కుశ క్యారెక్టర్లు వేసి మరీ రక్తికట్టించారు పార్టిసిపెంట్స్. బిగ్ బాస్ ఎపిసోడ్ చివరి వారంలోకి అడుగు పెట్టింది. ఇక వారం రోజుల సమయమే మిగిలి ఉన్న నేపధ్యంలో విజేత ఎవరవుతారనేది ఉత్కంఠను పెంచుతోంది. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న నలుగురిలో ఆదర్ష్, హరితేజలు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. నవదీప్, శివబాలాజీల పేర్లు అసలు పరిగణలోకి తీసుకోలేదు. మిగిలిన ఇద్దరిలో అర్చన, దీక్షలలో ఎవరు బయటకు వెళతారు. ఎవరు ఉంటారనేది ఆదివారం ఎపిసోడ్ తో తేలనుంది. 63వ ఎపిసోడ్‌ను ఫుల్ ఎనర్జీతో మొదలుపెట్టేశారు జూనియర్ ఎన్టీఆర్.
         ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘జై లవకుశ’ భామలు నివేదా థామస్, రాశీఖన్నాలు బిగ్‌బాస్ హౌస్‌లో ప్రత్యక్షమై చిత్ర విశేషాలను తెలిపారు. ఇక బిగ్‌బాస్ హౌస్ ఫేమస్ కుక్ శివబాలాజీ చేత ఆమ్లెట్ చేయించుకుని తినేసింది నివేదా థామస్. మరోవైపు జై లవకుశ నిర్మాణదారు ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్ అక్కడ ఎంట్రీ ఇవ్వడం మరింత సంబరాన్ని తెచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ వచ్చీ రావడంతోనే శివబాలాజీ వైపు చూసి ఆమ్లెట్ కావాలని కోరాడు. అది రుచి చూసి సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు.
       బిగ్‌బాస్ సీజన్ 1 టైటిల్ విన్నర్ ఎవరిని అర్చనను అడగగా… శివబాలాజీ, హరితేజ, నవదీప్‌లలో ఒకరు ఉంటారని చెప్పారు. హౌస్‌లో ‘జై లవకుశ’ టీం సందడిని నాటీవీ ద్వారా చూస్తూ వారితో మాట్లాడారు ఎన్టీఆర్. బిగ్ బాస్ కన్టెస్టెంట్స్ కోసం ‘జై లవకుశ’ మూడు టీజర్స్‌తో పాటు, ట్రైలర్‌ను ప్లే చేసి చూపించారు. ఆకట్టుకున్నారు. తన తమ్ముడు ఎన్టీఆర్‌తో 2013 నుండి సినిమా తీయాలని ప్రయత్నించాం. ఇప్పటికి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లోనే సినిమా తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు కల్యాణ్ రామ్. ఈ లోపు బిగ్ బాస్ హౌస్‌కి సడెన్ ఎంట్రీ ఇచ్చాడు  ఎన్టీఆర్. ఈనెల 21న విడుదల కాబోతున్న ‘జై లవకుశ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌ ప్రత్యక్షమై కన్టెస్టెంట్స్‌కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు ఎన్టీఆర్. 63 మూడు రోజులు పాటు ‘నాటీవీ’ ద్వారానే ఎన్టీఆర్‌ను చూసిన పార్టిసిపెంట్స్ కు ఎన్టీఆర్ తమ వద్దే ఉండటంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 
       ఎన్టీఆర్ హౌస్ లోకి రాగానే పంచ్‌లు పేలాయి. హౌస్ మేట్స్ కోసం ‘జై లవ కుశ’ అనే వెరైటీ టాస్క్ ఇచ్చారు.. ఈ సినిమాలో తాను పోషించిన మూడు పాత్రలకు సంబంధించిన టీషర్ట్ హౌస్ మేట్స్‌కి అందించారు. ఆపాత్రలకు తగ్గట్టు నటించాలనే కోరారు. ‘జై , లవ, కుశ’ పాత్రల్లో వారు నటించారు. నివేదా థామస్, రాశీఖన్నాలు ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. ‘జై లవ కుశ’ టాస్క్ పూర్తయ్యాక కళ్యాణ్ రామ్, నివేదా, రాశీ ఖన్నాలు వారి ఫెర్ఫామెన్స్‌ని బట్టి మార్క్ కేటాయించారు. ఇందులో అత్యధికంగా ఆమ్లెట్ వేసి ‘జై’ క్యారెక్టర్ చేసిన నవదీప్ కు ఎక్కువ పాయింట్స్ రాగా.. అర్చన అందరికంటే తక్కువ మార్కులు సంపాదించుకుంది. దీక్ష కంటే అర్చనకు తక్కువ మార్కులు వచ్చాయంటే ఎన్టీఆర్ సరదాగా ఏడిపించే ప్రయత్నం చేశారు. 
       అర్చన, దీక్షలలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్‌కు చేరేది నేడు తేలనుంది. ఇద్దర్నీ ఎలిమినేట్ చేసి డబుల్ డమాకా ట్విస్ట్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోవైపు హౌస్ మేట్స్ కోసం వంట వండి మరీ రుచి చూపించారు. పాక శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్ ఎలా వండారు అనేది ఇవాల్టి ఎపిసోడ్ లో చూడాల్సిందే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*