రేవంత్ రెడ్డి పై అసంతృప్తి



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ అయ్యారు. పేరుకు ఎల్. రమణ అధ్యక్షుడిగా ఉన్నా.. పార్టీని అంతా నడిపిస్తోంది రేవంత్ రెడ్డినే. ఆయన చూపు ఇప్పుడు కాంగ్రెస్ పై పడింది. తనకు మామ వరుస అయిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డితో రేవంత్ కి బాగా సంబంధాలున్నాయి. హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించవచ్చనే అంచనాకు వచ్చాడు రేవంత్. అందుకే కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నారాయన. ఇది కొందరు టీడీపీ నేతలకు నచ్చడం లేదు. 
            కాంగ్రెస్ తో పొత్తు ఆత్మహత్య సదృశ్యమని టీడీపీ జాతీయ అధ్యక్షులు, సి.ఎం చంద్రబాబునాయుడు చెప్పే మాట. కానీ ఓటుకు నోటుకేసు తర్వాత చంద్రబాబు దృష్టి అంతా ఏపీ పైనే పెట్టారు. తెలంగాణ టీడీపీని పట్టించుకుంటున్నా… ఎక్కువ దృష్టి అంతా ఏపీ పైనే అన్నది నిజం. ఇలాంటి సమయంలో చంద్రబాబు మాటలకు విరుద్దంగా రేవంత్ వెళుతున్నాడనేది కొందరు నేతల విమర్శ. ఉమ్మడి శత్రువును ఓడించాలంటే చిన్న శత్రువుతో చేతులు కలపాలనేది మరోవైపు రేవంత్ వాదనగా ఉంది. మరి ఇలాంటి సమయంలో రేవంత్ మాట విని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా లేక బీజేపీతోనే కలిసి పోయి ఎన్నికలకు వెళతారా అనేది ఇప్పుడు హాట్ టాపికైంది. 
          తెలంగాణలో ఆ మాత్రమన్నా పార్టీ ఉందంటే కారణం రేవంత్ రెడ్డినే. కానీ ఆయన వల్లనే పార్టీ సర్వనాశనం అయిందనే వారు ఉన్నారు. ఇలా ఎవరికి వారే అంతర్గతంగా పైకి చెప్పకుండా వాదులాడుకోవడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో పార్టీకి కాయకల్ప చికిత్స చేయకపోతే టీడీపీ ఇబ్బందుల్లో పడుతుందన్నది వాస్తవం.    
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*