హస్తినకు వెళ్లిన సి.ఎం



Want create site? Find Free WordPress Themes and plugins.
      అసమ్మతి, కొట్లాటలు, వివాదాలు కాంగ్రెస్ లో సాధారణమే. అలా లేకపోతే అది కాంగ్రెస్ పార్టీనే కాదంటారు. ఇప్పుడు కర్నాటకలోను అవే జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత పార్టీలో అసమ్మతి పెరిగింది. దీన్ని  చల్లార్చేందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. అందుకే తక్షణమే హస్తినకు రావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆదేశించారు. ఫలితంగా రాత్రికి రాత్రి ఢిల్లీ చేరారు సిద్ద రామయ్య.
 
       కేబినెట్‌ విస్తరణలో కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్ వర్గానికి మొండి చేయి ఎదురైంది. సీఎం సిద్ధరామయ్యతో ఆయనకు పొసగడం లేదు. సిఎం పాల్గొనే  కార్యక్రమాలకు పరమేశ్వర్‌ దూరంగా ఉంటున్నారు. కారణాలు ఏవైనా ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలే వివాదానికి దారి తీసింది పార్టీ హైకమాండ్ నమ్ముతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఐక్యంగా ఎదుర్కొనాలని సిద్ద రామయ్య చెబుతున్న మాట. పరమేశ్వరన్ ఇందుకు సహకరించడంలేదని సిఎం చెబుతున్నాడు. అందుకే సోనియాగాంధీతో మాట్లాడి పరమేశ్వర్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని సిద్ధరామయ్య కోరారు. మరోవైపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైనా సోనియాకు నివేదిక ఇచ్చారు. బెంగళూరులో జరిగిన జర్నలిస్టు గౌరి లంకేష్‌ హత్య ఉదంతం పై సోనియాగాంధీ నివేదిక కోరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను కూడా సిద్ధరామయ్య, సోనియాగాంధీకి వివరించారు. సీఎం సిద్ధరామయ్య రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గౌరీ లంకేష్ హత్య ఉదంతం పైనా వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*