జూనియర్ ఎన్టీఆర్ ను వెనక్కు నెట్టిన బాలయ్య



Want create site? Find Free WordPress Themes and plugins.
బిగ్ బాస్ షో కు కాకుండా రానా హోస్ట్ గా ఉన్న నెంబర్ వన్ యారికి వెళ్లాడు నందమూరి అందగాడు బాలయ్య. అక్కడ రానాతో ఆడిపాడి హల్ చల్ చేశాడు. ఏక్ పెగ్ లా.. అంటూ స్టెప్పులు వేశాడు. బాలయ్యతో పాటు.. పూరి జగన్నాధ్ అక్కడకు వెళ్లిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో తర్వాత స్టార్ మాటీవీ రేటింగ్ లో దూసుకుపోతోంది. దీంతో పైసా వసూల్ బృందాన్ని ఎలాగైనా తీసుకురావాలని ఆలోచించారు రానా. అలా బాలయ్యతో మాట్లాడి తన షోకు వచ్చేలా ప్లాన్ చేశాడు. అంతే బాలయ్య వచ్చిన ఆ షోకు టీఆర్పీ రేటింగ్ 12.52కు వచ్చిందట. అదే వారంలో ఎన్టీఆర్ షో అంత కంటే తక్కువ వచ్చిందని సమాచారం. దీంతో ఎన్టీఆర్ ను బాలయ్య తొక్కేశాడనే ప్రచారం మొదలైంది. 
           వాస్తవంగా బాలయ్య బిగ్ బాస్ షోకు వెళతాడనుకున్నారు. కారణం ఏదైనా గానీ అక్కడకు వెళ్లలేదు బాలయ్య. బిగ్ బాస్ షూటింగ్ జరిగే పుణె ప్రాంతం దూరం కావడం, మరో రోజు సమయం వృధా కానుండటం ఒక కారణమైతే.. అంతర్గతంగా మరికొన్ని అంశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి సమయం కోసం ఎదురుచూస్తున్న హీరో రానా బాలయ్య మనసును ఇట్టే పట్టేశాడు. తనవైపుకు తిప్పుకుని తాను హోస్ట్ గా ఉన్న టీవీ చానల్ కు రప్పించుకున్నాడు. రక రకాల ప్రశ్నలు అడిగి చానల్ రేటింగ్ ను పెంచుకున్నాడు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*