కేటీఆర్ అవార్డు కోసం డబ్బులు పెట్టారనే చర్చ



Want create site? Find Free WordPress Themes and plugins.
       తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. 49వ స్కోచ్ సమ్మిట్ ఢిల్లీలో ఈ అవార్డును ప్రదానం చేసింది. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసినందుకు ఈ గుర్తింపు దక్కిందని అంతా ప్రచారం చేశారు. స్కోచ్ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చార్ కేటీఆర్‌ గురించి చాలానే చెప్పారు. కేటీఆర్ సృజనాత్మకంగా స్పందించిన తీరు ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సఫలంచేసే రీతిలో మంత్రి కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. ఐటీ రంగ విశేష వృద్ధికోసం ఆయన పనిచేస్తున్న తీరు బాగుంది. నూతన భారతం కోసం కొత్త రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా ఉంది. అందుకే స్కోచ్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చామనిచెప్పారు. 
       కేటీఆర్ కు అవార్డు వచ్చిందని ప్రకటించడం మొదలు తీసుకునే వరకు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. కానీ ఆ అవార్డు ఇచ్చిన వైనం పై ఇప్పుడు చర్చ సాగుతోంది.  ఈ అవార్డుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గురుగావ్‌ కేంద్రంగా పనిచేసే సమీర్‌ కొచ్చార్‌ అనే వ్యక్తి తన పేరుతో స్కోచ్‌  అవార్డును ఇస్తున్నారు. 2003 నుంచి ఏటా పరిపాలన, ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాలకు చెందిన వారికి ఇలా అవార్డులను ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఇలానే గతంలో లైప్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు ఇచ్చారు. 
       ఏటా ఫిబ్రవరిలో అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకారం ఉంటోంది. తాము చేసిన సేవల పై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వాలి. ఏటా ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో అవార్డులు ప్రదానం చేస్తారు. ఆ సమయంలో కొచ్చార్ సంస్థ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌లో ఒక స్టాల్‌ను బుక్‌ చేసుకోవాలి. ఇందుకు రూ.5 నుంచి రూ.10 లక్షల దాకా చెల్లించాలి. ఆ తర్వాత వీఐపీల చేతుల మీదుగా అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. డబ్బులతో స్టాల్స్ కొంటేనే ఎవరికైనా అవార్డులు వస్తాయి. లేకపోతే రావని అర్థమవుతోంది. ఇప్పుడు కేటీఆర్ కూడ అలానే డబ్బులు ఇచ్చి మరీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందుకే అవార్డు వచ్చిందనే చర్చ లేకపోలేదు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*