కాకినాడ మేయర్ గా సుంకర పావని



Want create site? Find Free WordPress Themes and plugins.
       కాకినాడ నగర పాలక మేయర్‌ గా 28వ డివిజన్ కార్పోరేటర్ సుంకర పావని ఎన్నికైంది. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా కాలా సత్తిబాబును తెదేపా అధిష్ఠానం ముందే నిర్ణయించింది. సుంకర పావని ఎమ్మెలే కొండబాబుకు అనుకూల వర్గం. కాకినాడ ఎంపీ తోటనరసింహం, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు , జ్యోతుల నెహ్రూ, డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా లకు దగ్గర బంధువు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మేయర్ అభ్యర్థిత్వం ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ముగ్గురూ పార్టీ అధిష్ఠానానికే నిర్ణయం వదిలేశామని పైకి చెప్పినా ఎవరికి వారే తమ వర్గం నేతలు తెచ్చేందుకు పావులు కదిపారు. దీంతో సి.ఎం చంద్రబాబు నాయుడు స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే సుంకర పావనికి మేయర్ కిరీటం అప్పగించారు. 
       మేయర్‌ అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసింది తెదేపా నాయకత్వం. అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే మేయర్‌ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని మంత్రులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే వదిలేశారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం మేయర్‌ అభ్యర్థిగా సుంకర పావని పేరును అధికారికంగా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. 30 ఏళ్ల అనంతరం కాకినాడ నగరపాలక సంస్థలో తెదేపా పాగా వేసింది. మొత్తం 50 డివిజన్లు ఉన్న కాకినాడ నగరపాలక సంస్థలో 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. అందులో తెదేపా 39 చోట్ల పోటీ చేసి 32 స్థానాల్లో విజయం సాధించగా.. మిత్రపక్షం భాజపా 9 డివిజన్లలో పోటీ చేసి మూడు చోట్ల గెలిచింది. వైకాపాకు ఈ ఎన్నికల్లో 10 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 
      మరోవైపు సుంకర పావని భర్త తిరుమల కుమార్ కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా పని చేస్తుండటం ఆమెకు కలిసి వచ్చింది. మేయర్ గా ఎంపికైన సుంకర పావనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*