అదిరిపోయిన స్పైడర్ మూవీ ప్రీ రిలీజ్ పంక్షన్



Want create site? Find Free WordPress Themes and plugins.
     స్పైడర్ సినిమా ప్రీ రిలీజ్ పంక్షన్ అదిరిపోయింది. ప్రతి సినిమాకీ మహేష్‌బాబు ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నాడని ప్రశంసించారు ప్రముఖ నటుడు కృష్ణ. మహేష్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం ‘స్పైడర్‌’. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకుడు. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తాను సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లినప్పుడు తొలి అవకాశం తమిళ చిత్రంలోనే వచ్చిందన్నారు సూపర్ స్టార్. తమిళం నేర్చుకోకపోవడంతో ఆ అవకాశం దక్కకుండాపోయిందని గుర్తు చేశారు. ఆ తర్వాతనే ఆదుర్తి సుబ్బారావు ‘తేనె మనసులు’ చిత్రంతో తనను పరిచయం చేశారని గత స్మృతులను నెమరేసుకున్నారు. 350కు పైగా చిత్రాల్లో నటించిన తనను అభిమానులు ఎంతగానో ఆదరించారన్నారు. ‘స్పైడర్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉందని, మహేష్‌బాబు చాలా స్పష్టంగా తమిళం మాట్లాడారని చెప్పారు. ఓ మంచి దర్శకుడైన మురగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ తమిళంలో పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. 
      ఈసందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్  స్పైడర్ మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో అంశాలతో వచ్చిన స్పైడర్ మూవీని ఆదరించాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.  ప్రముఖ నటి విజయ నిర్మల, మహేష్‌ సతీమణి నమ్రత, దర్శకుడు వంశీ పైడిపల్లి, ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్‌ తదితరులు పాల్గొనగా…మహేష్‌ తనయుడు గౌతమ్‌.. కుమార్తె సితారలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మళయాళం ట్రైలర్ ను విడుదల చేశారు. అది విడుదల చేసే సమయంలో యాంకర్ సుమ తన మాతృ భాష మళయాళంలో మాట్లాడి ఆకట్టుకున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*