కోట్లు పెట్టి షటిల్ కోర్టు నిర్మించనున్న రాయపాటిWant create site? Find Free WordPress Themes and plugins.
    నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఆటలంటే మమకారం. క్రీడాకారులను ప్రొత్సహించేందుకు కోట్ల రూపాయలను వెచ్చిస్తారు. తనకు వచ్చే ఎంపీ నిధులను చాలా వరకు క్రీడలకు ఖర్చు చేస్తుంటారు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు (రంగారావు) అదే పని చేస్తున్నారు. గుంటూరు జిల్లా షటిల్ అసోసియేషన్ అధ్యక్షుడైన రాయపాటి రంగబాబు..పల్నాడులోని మాచర్లలో షటిల్ కోర్టు నిర్మించనున్నారు. ఇందుకు ఏకంగా రూ. 1.50 కోట్లు కేటాయించనున్నారు. ఎంపీ నిధులను ఇందుకు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
       పివి సింధూ లాంటి తెలుగు వనిత ఆటల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. పుల్లెల గోపిచంద్ వంటి గురువుల ప్రొత్సాహంతో దేశానికి పతకాలు తెస్తున్నారు సింధూ లాంటి అమ్మాయిలు. అందుకు పల్లెసీమ ఆటగాళ్లల్లో ప్రతిభ ఉన్నా..ప్రొత్సాహం కరువు అవుతుందనేది నిజం. అలా కాకుండా ఉండేందుకే మాచర్లలో కోట్ల రూపాయలను వెచ్చించి ఆధునిక సదుపాయాలతో కోర్టును నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన 66 సెంట్ల స్థలం కేటాయించింది ప్రభుత్వం. మాచర్లలో అధునాతన హంగులతో షటిల్ కోర్టు ఏర్పాటుకు ఎంపీల కోటాల నుంచి నిధులు అడుగుతున్నారు. దాతల చేయూతతో ఇది నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి.
       మాచర్ల ప్రధాన రహదారి పక్కనే ఉన్న జడ్పీ భూమి 66 సెంట్లు ఇందుకు సిద్దం చేశారు. చంద్రవంక వంతెన పక్కనే ఉన్న ఈ భూమి కేటాయింపుతో అంతా ఇప్పుడు రాయపాటిని అభినందిస్తున్నారు. మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల క్రీడాకారులు ఇక్కడకు వచ్చి ఆడుకునేందుకు వీలుంటుంది. ప్రత్యేక కోర్టులు ఇండోర్‌ స్టేడియంలో ఉండనున్నాయి. పెద్ద ఎత్తున గాలులు, వర్షం వల్ల సమస్యలు లేకుండా షెడ్ల నిర్మాణాలు చేపడతారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు కొన్ని నిధులు కేటాయిస్తుండగా, మిగతా ఎంపీల నుంచి నిధులు సమకూర్చుకోవాలన్నది ప్రతిపాదన ఉంది. పలువురు స్థానిక దాతలు ముందుకు వచ్చారు. తమ వంతుగా సహకరించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో ఆధునికీకరణతో కూడిన నిర్మాణాలకు రూ.1.50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఆటలు ఆడే కోర్టుతో పాటు, ప్రేక్షకుల కోసం నిర్మాణాలు చేస్తారు.
      షటిల్‌ స్టేడియం నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని జిల్లా షటిల్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపాటి రంగారావు తెలిపారు.  నిధుల సమీకరణ జరుగుతోంది. స్థలం కేటాయించినందుకు జడ్పీ వారికి కృతజ్ఞతలు. ఆధునిక హంగులతో నిర్మించే ఈ స్టేడియం వల్ల పల్నాడు ప్రాంతానికి మేలు జరుగుతుంది. క్రీడాకారులకు వెసులుబాటుగా ఉంటుంది. ఎంపీ రాయపాటి ఇందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు రంగబాబు. 
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*