క్షమాపణ చెప్పిన ప్రియాంక



Want create site? Find Free WordPress Themes and plugins.
       సిక్కిం రాష్ట్రం అల్లర్లకు నిలయమని తాను చేసిన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకుంది బాలీవుడ్‌ నటి, నిర్మాత ప్రియాంక చోప్రా. దీని పై దేశ వ్యాప్తంగా దుమారం రేగడమే ఇందుకు కారణం. సిక్కిం లో ఎప్పుడు అల్లర్లు జరుగుతాయి. అసలు సినిమాల షూటింగ్ లు అక్కడ జరగనీయరు. వారికి సినిమా జ్ఞానం లేదు. అసలు సినిమాలే వారు తీయరని వ్యాఖ్యానించింది ప్రియాంక. సిక్కిం ప్రజలకు క్షమాపణ చెప్పిన ప్రియాంక అలా ఎందుకు అనాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేసింది.  ప్రియాంక అనుచిత వ్యాఖ్యలతో తమ రాష్ట్ర ప్రజల మనో భావాలు, ఆత్మగౌవరం దెబ్బతిన్నాయని సిక్కిం ప్రభుత్వం తప్పు పట్టింది. ఆమె వ్యాఖ్యలను ఖండించడంతోపాటు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. అనుకోకుండా నేను ఆ వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యలు సినిమాను ఉద్దేశించి చేసినవి మాత్రమే. నా మాటలు బాధిస్తే క్షమాపణ కోరుతున్నా’’అని చెప్పాల్సి వచ్చింది. 
        ఆగస్టు15నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు కురచ దుస్తులతో కనపడి అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రియాంక. దాని పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ ఆ విషయంలో ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు సిక్కిం రాష్ట్ర ప్రజలతో పాటు..ప్రభుత్వం డిమాండ్ చేయడంతో తప్పు తెలుసుకుంది. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరముంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*