శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పిన పవన్



Want create site? Find Free WordPress Themes and plugins.
        ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన అలా ట్వీట్ చేస్తే చాలు లక్షల్లో వ్యూస్ వెళుతుంటాయి. ఇప్పుడు ఆయన ట్విటర్‌ అభిమానుల సంఖ్య రెండు మిలియన్లను దాటింది. ఇది చూసిన పవన్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాకపోతే కాస్తంత అభిమానులను హత్తుకునేలా ట్వీట్ చేశాడు. వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. 
         మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం ప్రారంభించినప్పుడు దారంతా గోతులు. చేతిలో దీపం లేదు. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టాను. నేను స్పందించిన ప్రతి సమస్యకి మేము సైతం అంటూ ప్రతిస్పందించారు. ఫలింతగా ఈరోజు ఇరవై లక్షల దీపాలతో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు. ఇట్లు మీ పవన్‌కల్యాణ్‌’ అని ట్వీట్‌ చేశారు పవన్‌.
       ఇలా ట్వీట్ చేయడమే ఆలస్యం అభిమానులు అంతే స్థాయిలో రీ ట్వీట్ల్ మొదలుపెట్టారు. వందలు, వేల సంఖ్యలో అది కొనసాగుతున్నాయి. మీరు చూపించే ఈ అభిమానమే మాలో ఉత్సాహం నింపుతుందని ఒకరంటే..మీరు సిఎం కావాలని మరికొందరు, నటుల్లో మీ లాంటి వారు ఉండరని..ఇంకొందరు ఇలా ఎవరికి వారే ట్వీట్ల యుద్దం కొనసాగిస్తున్నారు. 
        ‘కాటమరాయుడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్‌ కల్యాణ్. ఆశించినంతగా ఆ సినిమా ఆడలేదు. దీంతో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పవన్‌కి జోడీగా కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తుండగా… హారికా, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 2018 జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
      అక్టోబర్ నుంచి తాను పూర్తి స్థాయి రాజకీయాలకు సమయం కేటాయిస్తానని చెప్పిన పవన్…అసలైన ఎంట్రీ ఇస్తే కీలక మార్పులు జరిగే వీలుంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*