ఉద్యమాన్ని ఆపిన ముద్రగడ



Want create site? Find Free WordPress Themes and plugins.
       మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. డిసెంబర్ 9 వరకు తాను ఎలాంటి ఉద్యమాలు చేసేది లేదనిచెప్పారు. దీంతో తెర వెనుక అసలు ఏం జరిగిందనే విషయం పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లి వచ్చాక ముద్రగడ తీరులో మార్పు వచ్చింది. తన వియ్యంకుడు రవి కుమార్ ఆస్తుల విషయంలో వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయంలో ముద్రగడకు టీడీపీ నేతలు సాయం చేస్తామని చెప్పారట. ఇందుకు ముద్రగడ కొన్నాళ్ల పాటు ఉద్యమం ఆపుచేయాలనే ప్రతిపాదన వచ్చిందంటున్నారు. ఇందుకు ముద్రగడ ఒప్పుకున్నారంటున్నారు. ఫలితంగా డిసెంబర్ 9 వరకు తాను ఎలాంటి ఉద్యమం చేసేది లేదని తేల్చి చెప్పారు ముద్రగడ. 
      సి.ఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పావులు కదిపితే తనకు కలిసి వస్తుందని బలంగా నమ్మారు ముద్రగడ. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో అది పెద్దగా పని చేయలేదు. మరోవైపు కాపులను ఏకతాటికి తెచ్చే ప్రయత్నం చేసినా అనుకున్నంత స్పందన లేదు. ప్రచారం అంతంత మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో ఉద్యమం చేసినా ప్రయోజనం లేదని ఆలోచిస్తున్నారట. అందుకే చాలా గౌరవంగా డిసెంబర్ 9 వరకు ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సి.ఎం చంద్రబాబునాయుడు తమకు తీపి కబురు అందిస్తారని చెబుతున్నారు ముద్రగడ. అది ఏంటి అనేది ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*