టీడీపీ వైపు చూస్తున్న కోట్ల



Want create site? Find Free WordPress Themes and plugins.
        కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. కర్నూలు జిల్లాలో గట్టి  నేత. కాంగ్రెస్ లో ఉన్న ఆయన పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నాడు. వైసీపీ నేతలు ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు జరిపారు. ఇందుకు కోట్ల సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. కానీ నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఆలోచన మారిందంటున్నారు. వైకాపాలో ఉంటే తన రాజకీయ భవిష్యత్ మరికొన్నాళ్ల పాటు ఇబ్బంది పడుతుందేమోనని తటపటాయిస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆయనతో మంతనాలు జరిపారు. చర్చలు ఫలవంతమయ్యాయని తెలుస్తోంది. కానీ ఇంకా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.
      కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాత గతంలో డోన్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత ఆలూరులో పోటీ చేసినా గెలవలేదు. ఇప్పుడు వారిద్దరు ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారట. ఇంకోవైపు నారా లోకేష్ వారిద్దరితో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా టీడీపీలోకి కోట్ల కుటుంబం చేరుతుందనే వాదన లేకపోలేదు. కాకపోతే డిప్యూటీ సి.ఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి, కోట్ల  కుటుంబానికి మధ్య రాజకీయ వైరం ఉంది. కాబట్టి వారు కోట్లను ఆహ్వానిస్తారా లేదా అనే విషయం పై సందిగ్దత నెలకుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*