త్వరలోనే రాహుల్ కు కిరీటం



Want create site? Find Free WordPress Themes and plugins.
     అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇండియాకు వచ్చాక కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ను ఎన్నుకునేందుకు రంగం సిద్దమైంది. వచ్చే నెలలలో కిరీటం అప్పగించేలా సీనియర్లు పావులు కదుపుతున్నారు. ముందుగా పార్టీ అంతర్గత ఎన్నికలు జరిపి..ఆ తర్వాత రాహుల్ ను ఎన్నుకోనున్నారు. నెల రోజుల్లోనే అంతా ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు ఆపార్టీ సీనియర్లు. ఇన్నాళ్లు పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ నిర్వహిస్తారని చెప్పడం మినహా ఆచరణ రూపం దాల్చలేదు. 
     కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటోంది. గతంలోలా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. అందుకే పార్టీ పగ్గాలను రాహుల్ కు అప్పగించే కసరత్తు జరుగుతోంది. తాను పార్టీ బాధ్యతలను తీసుకునేందుకు సిద్దమని..త్వరలోనే ఆపని చేస్తానని అమెరికాలో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు రాహుల్. ఇది తమ పార్టీ నేతలకు సంకేతం ఇచ్చినట్లు అయింది. ఇన్నాళ్లు అనుభవం కోసం అంటూ రాహుల్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సోనియమ్మ తటపటాయించారు. ఇప్పుడు ఇక అవసరం లేదనేది ఆమె భావనగా ఉందట. 
     రాహుల్ బాధ్యతలు తీసుకోవడం ఇప్పటికే ఆలస్యమైందనేది పార్టీ నేతల మాటగా ఉంది. ఆయన ఎన్నికైతే కీలక మార్పులు,చేర్పులు చోటు చేసుకునే వీలుంది. తెలుగురాష్ట్రాల్లోను కాంగ్రెస్ ఇంఛార్జ్ లు మారతారనే చర్చ సాగుతోంది. మధుయాష్కీ ఇప్పుడు రాహుల్ తో కలిసి అమెరికా పర్యటనలో పాల్గొంటున్నారు. ఆయనకు కీలక పదవి వస్తుందనే ప్రచారం ఉంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*