డేరాబాబా ఏం చెప్పారో తెలుసా…



Want create site? Find Free WordPress Themes and plugins.
     సాధ్వీల పై అత్యాచారం జరిపిన కేసులో 20 సం. శిక్ష అనుభవిస్తున్నాడు డేరా బాబా గుర్మీత్ సింగ్. మరోవైపు జంట హత్యల కేసు విచారణ ఇప్పుడు సాగుతోంది. దీంతో డేరా బాబా భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసు తీర్పును పంచకుల సీబీఐ కోర్టు సెప్టెంబర్ 22కు వాయిదా వేయడమే ఇందుకు కారణం. కీలక సాక్షి ఖట్టా సింగ్‌ స్టేట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోలేదు. గుర్మీత్‌ మాజీ డ్రైవర్‌ అయిన ఖట్టాసింగ్ వాంగ్మూలం ఈ కేసులో కీలకం. గుర్మీత్ చీకటి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చారనే కోపంతో జర్నలిస్ట్‌ రామచంద్ర ఛత్రపతి, డేరా మాజీ మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ను డేరా బాబా హత్య చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయం పై కేసు నమోదైంది. 
      2002 జులైలో రంజిత్‌ సింగ్‌ తన స్వగ్రామంలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన కొద్ది నెలలకే ఛత్రపతిని సిర్సాలోని ఆయన ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ రెండు హత్య కేసుల వెనుక గుర్మీత్‌ హస్తం ఉన్నట్లు సీబీఐ తేల్చింది. గుర్మీత్‌కు వ్యతిరేకంగా పత్రికల్లో రాసినందుకే ఛత్రపతిని హత్య చేసినట్లు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. ఈకేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తుది విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు నిందితులు కోర్టుకు నేరుగా హాజరుకాగా.. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. గుర్మీత్‌ స్వయంగా మాట్లాడాడు.
      డేరా అనుచరుల బెదిరింపుల వల్ల గతంలో ఆయనకు అనుకూలంగా మాట్లాడానని…ఇప్పుడు నిజాలు చెబుతానని డ్రైవర్ అంటున్నాడు. దీంతో అతని వాంగ్మూలాన్ని తీసుకోవాలా అనే కోణంలోను ఆలోచిస్తోంది కోర్టు. ‘నన్ను, నా కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. అందుకే భయపడిపోయా. మళ్లీ నా వాంగ్మూలం తీసుకోండి’ అని ఖట్టా సింగ్‌ తన పిటిషన్‌లో కోరాడు. డేరా బాబా దత్త పుత్రికగా చెబుతున్న హనీప్రీత్‌ సింగ్‌ ఆచూకీ చెబుతానని ఆయన అన్నాడు. పుణే, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని కీలక ప్రాంతాల్లో హనీప్రీత్ ఉంటుందన్నారు ఖట్టా సింగ్. దీంతో ఈకేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*