నవ్యాంధ్రకు రానున్న బిల్ గేట్స్



Want create site? Find Free WordPress Themes and plugins.
      మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనున్నారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ తరుపున, రాష్ట్రంలోని వ్యవసాయం, వైద్య రంగానికి సహకారం అందించనున్నారు బిల్ గేట్స్. ఇప్పుడే కాదు..2004కు ముందు ఇలానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బిల్ గేట్స్ ఫాండేషన్ ఇతోధికంగా సాయం అందించింది. ఇక మీదట అలానే చేయనుంది. బిల్ గేట్స్, అప్పటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ లు ఏపీ అభివృద్ధిని చూసి మెచ్చుకున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్రలో పంట భూములకు సంబంధించి సాంకేతికతను ఉపయోగించుకుని, ఏ భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుంది. ఏ ఎరువులు వేయాలి. ఎంత మోతాదులో వేయాలి అనే విషయాల పై బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. వీటన్నంటిని ఉపయోగించుకుని, ఆ భూమికి సంబంధించిన భూమి ప్రొఫైల్‌ను తయారుచేస్తారు. ఆ నివేదిక చూసిన తర్వాత తగు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గేట్స్‌ ఫౌండేషన్‌, ఆఫ్రికాలో వ్యవసాయ రంగానికి సహకారం అందిస్తుంది. అందుకనుగుణంగా సహాయక చర్యలు తీసుకుంటున్నాయి ఆయా దేశ ప్రభుత్వాలు. 
        ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టు అమలుచేసేందుకు మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ అంగీకరించింది. ఈ నెలాఖరులో రెండురోజుల పాటు ఏపీ స్మార్ట్‌ ల్యాండ్‌హోల్డర్‌ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొనే బిల్‌గేట్స్‌ సాయం సంగతి ప్రకటించనున్నారు. అంతే కాదు..సి.ఎం చంద్రబాబునాయుడుతోను ఆయన మాట్లాడనున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*