లగడపాటి లో బాబు ఇంకో కోణం చూసారంట



Want create site? Find Free WordPress Themes and plugins.
     విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తరచుగా సి.ఎం చంద్రబాబునాయుడును కలుస్తున్నారు. ఇంకేముంది లగడపాటి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం గుప్పు మంటోంది. నేను రాజకీయ సన్యాసంలో ఉన్నాను. ఆ మాట తప్పేది లేదంటారు లగడపాటి. ఆ తర్వాత ప్రచారం చల్లారుతోంది. వాస్తవంగా లగడపాటిని సి.ఎం చంద్రబాబునాయుడు పిలిచి మాట్లాడే కారణం వేరే ఉంది. లగడపాటి తన రాజకీయ చాణక్యంతో సర్వేలు చేయిస్తారు. ఆ సర్వే ఫలితాలు కచ్చితంగా ఉంటాయి. సర్వేల పై నమ్మకం ఎక్కువ. నంద్యాల ఉప ఎన్నికల్లో 15 శాతం ఓట్ల తేడా రెండు పార్టీల మధ్య ఉంటుందని..ఫలితంగా టీడీపీ అక్కడ గెలుస్తుందని చెప్పారు లగడపాటి. అంతే జరిగింది.
     అందుకే ఇప్పుడు లగడపాటి సేవలను మరో రకంగా సి.ఎం చంద్రబాబునాయుడు వినియోగించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతల పనితీరు ఎలా ఉంది. ఏంటనే విషయం పై ఆయన లోతుగానే సర్వేలు చేయిస్తున్నారు. ఇందుకు లగడపాటి సేవలను వినియోగించుకుంటున్నట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులే కాదు.. అధికారుల పనితీరు పై చంద్రబాబు నివేదికలు తెప్పించుకుంటున్నారట. ఒక రకంగా చెప్పాలంటే లగడపాటిని పూర్తిగా చంద్రబాబు నమ్మేశాడనే చెప్పాలి. ఆయన ఎలాంటి రిపోర్టు ఇస్తే అది కచ్చితం అనే అభిప్రాయానికి వచ్చారట. 
      స్వపక్ష నేతలే కాదు..విపక్ష నేతల్లో గట్టి వారు ఎవరున్నారు. వారిలో ఎవరు పనికి వస్తారు. ఎవరిని తీసుకోవచ్చు. వారి బలాలు, బలహీనతలు, సామాజిక నేపధ్యం, కులాలు, సమీకరణలు వంటి వివరాలను తెప్పిస్తున్నారట. ఈ పని అంతా మూడో కంటికి తెలియకుండా జరుగుతుంది. ఆ సర్వే వివరాలతో పాటు..మరికొన్ని అంశాల పై సర్వేలు చేయించి ఇచ్చేందుకు లగడపాటి కలుస్తున్నారట. మొత్తంగా చంద్రబాబుకు లగడపాటి సలహాదారుగా ఉపయోగపడుతున్నారని తెలుస్తోంది. రాజకీయంగా అడుగు పెట్టక పోయినా చంద్రబాబుకు ఇలా లగడపాటి సాయం చేస్తున్నాడని సమాచారం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*