వైఎస్ దగ్గర చంద్రబాబు డబ్బులు తీసుకునేవాడా…



Want create site? Find Free WordPress Themes and plugins.
       దివంగత సి.ఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర ఇప్పటి సి.ఎం చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకుని మరీ రాజకీయాలు చేసేవారనేది వైకాపా అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు చేసిన ఆరోపణ. 1978లో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ పని చేసేవారని ఆయన అన్నారు. ఐదు వేలు, పది వేలు తీసుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తాడనే వ్యాఖ్య ఇప్పుడు దుమారం రేపుతోంది.    
       తప్పులు చేస్తున్న విపక్ష నేత వైఎస్ జగన్ తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అవినీతి,అక్రమాలు చేసి సంపాదించిన వేల కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని కోరారు. ఇందుకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. జగన్ పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గు చేటని, జగన్ పై కావాలనే బురద చల్లుతున్నారని ఆరోపించారు అంబటి. చంద్రబాబు ఆస్తి రాజకీయాలలోకి వచ్చినప్పుడు రెండెకరాలని, ఈరోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడని అంబటి ప్రశ్నించాడు. 
        కేసులు మాఫీ కోసం చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని ఆయన విమర్శించారు. ఇలాంటి నేత జగన్ ను విమర్శించడం సిగ్గు చేటని తప్పు పట్టారు. జగన్ దైర్యంగా కేసులను ఎదుర్కొంటుంటే చంద్రబాబు సిగ్గు లేకుండా స్టేలు తెచ్చుకుని విచారణ సాగకుండా చేస్తున్నాడని అంబటి ఆరోపించాడు. దమ్ముంటే చంద్రబాబు తనపై విచారణకు ఆదేశించుకొని నీతిమంతుడని నిరూపించుకోవాలని అంబటి సవాల్ విసిరారు. 
     ఆధారాలు లేని ఆరోపణలు చేసే అంబటి నిజాలను నిరూపించాలనేది మరోవైపు తెలుగు తమ్ముళ్లు వాదనగా ఉంది. చంద్రబాబు మీద ఎన్ని ఆరోపణలు చేసినా..మరెన్ని కేసులు పెట్టినా ఒక్కటీ నిరూపణ కాలేదని తెలుసుకోవాలంటున్నారు టీడీపీ నేతలు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*