ఉంగరాల రాంబాబు మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, తాగుబోతు రమేష్, హరితేజ, పోసాని, ఆలీ, వెన్నెల కిషోర్, ఆశిష్ విద్యార్ధి తదితరులు
దర్శకుడు : క్రాంతి మాధవ్. కె
నిర్మాత : పరుచూరి కిరీటిని (యునైటెడ్ మూవీస్)
సినిమాటోగ్రఫి : సర్వేష్ మురారి
సంగీతం : గిబ్రాన్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
పరిచయ మాటలు…
నటుడు సునీల్. 170కు పైగా సినిమాల్లో నటించాడు. కమెడీయన్ నుంచి హీరోగా మారాక సునీల్ హిట్ కోసం పెద్ద పోరాటమే చేస్తున్నాడు. మర్యాదరామన్న మినహా మరో సినిమా ఆడలేదు. కృష్ణాష్టమి, భీమవరం బుల్లోడు, వీడు గోల్డ్ ఎహెయ్, జక్కన్న వంటి సినిమాలు హీరోగా నిరాశ పరిచాయి. దీంతో ఉంగరాల రాంబాబుమీద బాగానే ఆశలు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ షోకు వెళ్లి మరీ ప్రచారం చేసి వచ్చాడు. మరి హిట్ అవుతుందా.. ఫట్ అవుతుందా అనేది చూద్దాం.. 
కథలోకి వెళితే…
చిన్నతనంలోనే రాంబాబు ( సునీల్) తల్లిదండ్రులు చనిపోతారు. ఫలితంగా తాత దగ్గర పెరుగుతాడు. రూ.200 కోట్ల ఆస్తి ఉన్న రాంబాబు తాత చనిపోవడంతో అనాధగా మారతాడు. ఆస్తి అంతా పోతుంది. ఈ సమయంలో బాదం బాబా(పోసాని)ను కలవడంతో సునీల్ కి రూ.200 కోట్ల ఆస్తి కలిసొస్తుంది. ఆ డబ్బులతో ఓ ట్రావెల్స్ ను మొదలుపెడతాడు. వారు ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణించిన సావిత్రి(మియా) అనే అమ్మాయి ఉద్యోగం పోగొట్టుకుంటోంది. ఆ కోపంతో రాంబాబు వద్దకు వస్తుంది. వాస్తవం తెలుసుకున్న రాంబాబు సావిత్రికి తన ఆఫీసులోనే మేనేజర్ గా ఉద్యోగం ఇచ్చి గౌరవమిస్తాడు. తనను గౌరవించిన తీరు నచ్చిన మియా అతన్ని ప్రేమిస్తోంది. మరోవైపు రాంబాబు ఆ అందాల భామ ప్రేమలో పడతాడు.
                 అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు రాంబాబు. అందుకే కొచ్చిలోని సావిత్రి సొంతూరు చేగునే పుగొండి వనంకు  వెళతాడు. విప్లవ భావాలున్న కామ్రేడ్ రంగ నాయక్ (ప్రకాష్ రాజ్) ఆ ఊరి పెద్ద. అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోడు. ఇలాంటి సమయంలో రాంబాబు-సావిత్రి లు ఆ ఊరికి వెళ్లడంతో కథ ఆసక్తికరంగా మారుతోంది. అక్కడి ఊరి సమస్యలు ప్రకాష్ రాజ్ కుటుంబాన్ని చిక్కుల్లో పడేస్తోంది. ఇలాంటి సమయంలో రాంబాబు రంగంలోకి దిగి పరిష్కరిస్తాడు. తాను అనుకుంది సాధిస్తాడు. ఇంతకీ ప్రకాష్‌రాజ్ ఫ్యామిలీకి ఎదురైన సమస్య ఏంటి, సునీల్ ఎందుకు వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది… రాంబాబు ఏం చేశాడు…. మియా-రాంబాబుల పెళ్లికి ప్రకాష్‌రాజ్ ఒప్పుకున్నాడా… లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 
నటన ఎలా ఉందంటే…
‘ఉంగరాల రాంబాబు’ సినిమాలో ఇద్దరు నటుల పాత్ర బలంగా ఉంటోంది. ఒకరు హీరో సునీల్ అయితే మరొకరు ప్రకాష్ రాజ్. సునీల్ మరోసారి తనదైన కామెడీతోపాటు… నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ, డాన్స్, యాక్షన్ సీన్లలో తన సత్తా చాటాడు. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్‌ సీన్స్ బాగున్నాయి. ఊరి పెద్దగా, విప్లవ భావాలు కలిగిన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ తన పాత్రలో జీవించాడు. పోరాట స్పూర్తిని రగిలించే వ్యక్తిలా కనిపించాడు. ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోతాయి. సునీల్-ప్రకాష్‌రాజ్‌ల మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్ మియా జార్జ్ పర్వాలేదు. పాటల్లో తన గ్లామర్ ను ఒలకబోసింది. సునీల్-మియాల కెమిస్ట్రీ చూసేందుకు బాగుంది. ఇక వెన్నెల కిషోర్, పోసానీ కృష్ణమురళి, తాగుబోతు రమేష్‌ల కామెడీ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. హరితేజ, రాజీవ్ కనకాల, చలపతిరావులు తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. 
విశ్లేషణ….
అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, పెళ్లికి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేయడం, ఆ నెపంతో పెద్దల వద్దకు వెళ్లి మెప్పించడం, అమ్మాయి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి హీరో ఆకట్టుకోవడం చాలా సినిమాల్లో చూస్తాం. పెళ్లితో వారిద్దరి కథ సుఖాంతం కావడం తెలిసిన సంగతే. ఇప్పుడు అదే ఈ సినిమాలో ఉంది. కాకపోతే కథనం నడిపించిన తీరు దర్శకుడు కాస్తంత ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌హాఫ్‌లో స్టోరీ కాస్తంత విసుగుపుట్టిస్తూనే ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ ఇంటికి సునీల్ వెళ్లిన దగ్గర నుంచి కథలో వేగం వస్తోంది. 
                 మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దాం అనే ప్రకాష్ రాజ్ పాత్ర మలిచిన తీరు బాగుంది. క్రమశిక్షణ, సహనం, మంచితనం, సేవాగుణం వంటి అంశాలు కలిగిన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ అద్భుతం. సినిమాలో పాటలు పెద్దగా ఆకట్టుకోవు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సరిగా లేదు. కాసేపు నవ్వుకోవడానికి తప్ప సినిమాకు వెళ్లాల్సిన అవసరం లేదనిపిస్తోంది. కాకపోతే సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది. 
సాంకేతికాంశాలు…
సర్వేష్ మురారి అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లెటూరి అందాలను బాగా చూపించారు. ఇక గిబ్రాన్ సంగీతం అందించిన పాటలు అసలు అర్థమే కావు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గుర్తుండదు. డైలాగ్స్, ఎడిటింగ్ పర్వాలేదు. దర్శకుడు కె. క్రాంతిమాధవ్ పాత కథను కొత్త కథనంలో చూపించే ప్రయత్నం చేశాడు. నిర్మాత పరుచూరి కిరీటీ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. 
ప్లస్ పాయింట్లు
+ ప్రకాష్ రాజ్,సునీల్ ల నటన
+ సామాజిక సందేశం
+ అందమైన పల్లెను చూపిన తీరు
+ వెన్నెలకిషోర్, పోసానిల కామెడీ
+ నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్లు
– పాటలు, సంగీతం
– పస్టాప్ బోర్
– పాత కథ
మొత్తంగా… బోరింగ్ గానే ఉన్నా… సామాజిక విలువల కోసం చూడొచ్చు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*