ఆంధ్రా అభివృద్ధిని అభినందించిన బీహార్ డిప్యూటీ సి.ఎం



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ పర్యటన తర్వాత ఏపీలోకి అడుగు పెట్టారు బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ. అమరావతి రాజధానిని చూసి అబ్బురపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పథకం అమలుచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నగరానికి రైతుల నుంచి స్వచ్చంధంగా భూములు సమీకరించిన విధానంపై అధ్యయనం చేశారాయన. ల్యాండ్ పూలింగ్ స్కీం పై ఏపీ అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ ఆయనకు బాగా నచ్చింది. రాజధానికి కావాల్సిన భూమి అత్యంత వేగంగా సమీకరించి, రైతులకు తిరిగి ఫ్లాట్లు కేటాయించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
              ల్యాండ్ పూలింగ్ స్కీం అమలు పై మోడీ తన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రైతుల్ని రాజధాని అభివృద్ధిలో భాగస్వాముల్ని చేస్తూ ప్రజా రాజధానిగా అభివృద్ధి పరిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బేష్ అని కొనియాడారు. భూ సమీకరణ పథకం మిగతా రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. రెండు నెలల వ్యవధిలోనే 32వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించడం మాములు విషయం కాదన్నారు. రాజధాని నగరం మాస్టర్ ప్లాన్ బాగుంది. వేర్వేరు స్థాయిల్లో రైతులకు ప్రయోజనం కలిగేలా ఉందని చెప్పారు. ఫ్లాట్లను స్వీకరించిన రైతులు పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేసిన తీరు ఆయన్ను ఆకట్టుకుంది. తాను చూసిన.. తెలుసుకున్న విషయాలన్నింటినీ డిప్యూటీ సి.ఎం సుశీల్ కుమార్ నోట్ బుక్ లో నమోదు చేసుకున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*