చంద్రబాబు సర్కారును ప్రశసించిన కేంద్ర మంత్రి



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, పని తీరును మెచ్చుకున్నారు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ. ఆ శాఖ మంత్రిగా ఉమా భారతి ఉన్నప్పుడు ఇదే విధంగా ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గడ్కారీ వంతు వచ్చింది. పట్టిసీమతో పాటు.. నదుల అనుసంధానం వంటి అంశాలు నాకు తెలిశాయి. చంద్రబాబు సర్కారు చాలా మంచి పనులు చేస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి. అన్ని రాష్ట్రాలకు చెందిన సాగునీటి శాఖ మంత్రుల సమావేశంలో ఈ మాటలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపికైంది. ఏపీకి చెందిన దేవినేని ఉమ, తెలంగాణకు చెందిన హరీష్ రావులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారి ముందే ఈ సంగతి చెప్పడంతో మిగతా వారు చప్పట్లతో ప్రశసించారని తెలిసింది. 
             పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 8 వేల కోట్ల విలువైన పంటలను కాపాడామని.. నదుల అనుసంధానం ద్వారా నీటి కొరతను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని దేవినేని ఉమ ప్రస్తావించారు. అంతే కాదు… భూగర్భ జలాలను కాపాడేందుకు ఏపీలో 58 వేల చెక్ డ్యామ్ లను నిర్మించారు. 6,20,487 పంట కుంటలను ఏర్పాటు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రం ఇంత పెద్ద సంఖ్యలో వాటిని ఏర్పాటు చేయలేదు. అందుకే ఏపీ పనితీరును కేంద్ర మంత్రి స్వాగతించారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*