అనంతలో జగన్ కు షాక్ ఇవ్వనున్న ఆ పార్టీ నేతలు



Want create site? Find Free WordPress Themes and plugins.
అనంతపురం జిల్లాలో జగన్ వర్గానికి చెందిన ఇద్దరు నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైకాపాకు చెందిన గురునాథరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూధనరెడ్డిలు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి జగన్ తో పాటు… బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. కానీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ఈ మధ్య కాలంలో ఆయన క్రియాశీలకంగా లేరు. మరోవైపు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితోను బాగానే సంబంధాలున్నాయి. ఇలాంటి సమయంలో గురునాథ్ రెడ్డిని తప్పించి అనంతపురం నియోజకవర్గ ఇంఛార్జ్ గా నదీం అహ్మద్ ను నియమించారు జగన్. ఈ చర్య గురునాథరెడ్డికి కోపం వచ్చింది. జగన్ కోసం తాను పార్టీని, పదవులను వదులుకున్నాను. ఇప్పుడు తనను కాదని.. ఎలాంటి అనుభవం లేని వారికి బాధ్యతలు అప్పగిస్తారా అంటూ రుసరుసలాడుతున్నారట. ఇదే సమయంలో కొందరు అనుచరులు టీడీపీ వారితో మాట్లాడి గురునాథ రెడ్డి చేరిక పై చర్చించారని తెలుస్తోంది. 
         మరోవైపు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డి వైకాపాలో అంత సంతృప్తిగా లేడంటున్నారు. టీడీపీ ఓటమికి వైకాపా గెలుపుకు చక్రం తిప్పిన నేత మధుసూధనరెడ్డి అంటారు. అంత చేసినా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదనే వాదనుంది. అంతే కాదు.. కుటుంబ తగాదాలు ఆయనకు ఇబ్బందిగా మారాయంటున్నారు. అందుకే పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్కడ పోటీ చేసి ఓడినప్పటికీ పయ్యావుల కేశవ్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గౌరవించారు చంద్రబాబు. ఇప్పుడు పయ్యావులను కలిసి తన చేరిక పై మధుసూధన్ మాట్లాడారని సమాచారం. ఈ విషయంలో తనకేం అభ్యంతరం లేదని పయ్యావుల చెప్పారంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*