అరుస్తుందని ప్రియురాలు గొంతునొక్కేశాడు



Want create site? Find Free WordPress Themes and plugins.
      వారిద్దరు మైనర్లు. చూపులు కలిసాయి. మనుసుల్లో ఇష్టం ఏర్పడింది. ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా చాటుగా కలుస్తున్నారు. హద్దులు దాటారు. పెళ్లి చేసుకోమని అడిగింది. జీవితంలో సెటిల్ అయ్యాకనే ఆ పని చేస్తానన్నాడు. కాదంది ఆ యువతి. ఇందుకు అతను ఒప్పుకోకుండా ఆ అమ్మాయి పై చేయి చేసుకున్నాడు. గట్టిగా అరిచింది. మిగతా వాళ్లకు తెలుస్తుందని భయపడ్డాడు. చేతులతో గొంతు గట్టిగా నొక్కాడు. అదే చివరి అరుపు అవుతుందని ఊహించలేదు. అంతే ప్రియురాలు స్పృహ తప్పింది. ఏం చేయాలో అర్థం కాలేదు. స్నేహితులకు ఫోన్ చేశాడు. వారు వచ్చే లోపే ఆ అమ్మాయి ప్రాణం పోయింది. తప్పు తెలుసుకున్నాడు. తప్పించుకున్నాడు. కానీ క్షణికావేశంలో తన ప్రియురాలును పొగొట్టుకున్నానని మధనపడ్డాడు. ఎంత బాధపడ్డా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. చివరకు విషయం పోలీసులకు చేరింది. అతన్ని అదుపులోకి తీసుకోవడం విషయం అంతా బయటకు వచ్చింది. 
       రెండు రోజుల కిందట హైదరాబాద్ అమీన్ పూర్ గుట్టలో జరిగిన యువతి హత్యకు సంబంధించిన కథ ఇది. సినిమా స్టోరీలా ఉంది. ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ హత్య కేసులో నిందితుడు సాయికిరణ్‌ రెడ్డి. చాందినిని తానే హత్య చేసినట్టు సాయి ఒప్పుకున్నాడని తెలిసింది. మదీనాగూడలో ఉంటున్న సాయికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రేమ వ్యవహారం, హత్య బయటకు వచ్చాయి.  
       పెళ్లి విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. క్షణికావేశంలో ఆమెను చంపానని నిందితుడు చెప్పినట్టు సమాచారం. ఆరేళ్ల నుంచి చాందినితో పరిచయం ఉంది. ఈనెల 9వ తేదీ సాయంత్రం కలుద్దామని తానే ఫోన్‌ చేసింది. నేను చాందిని ఇంటికి వెళ్లాను. తర్వాత ఎప్పుడూ కలుసుకునే అమీన్‌పూర్‌ ప్రాంతానికి ఆటోలో వెళ్లాం. పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఇప్పుడు కాదన్నాను. కోపంతో ఆమెను కొట్టాను. గట్టిగా కేకలు పెట్టడంతో ఆమె గొంతు పట్టుకున్నాను. ఆమె స్పృహ తప్పిపడిపోయింది. పారిపోయానని పోలీసులకు చెప్పాడంటున్నారు. రెండు రోజులుగా తెలుగు న్యూస్ చానల్స్ లో కథలు కథలుగా వస్తున్న అసలు వార్త ఇది. అతను ఒక్కడే చంపలేదని..ఇంకెవరైనా ఉన్నారేమో విచారించాలని..అతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు కుటుంబ సభ్యులు. మై హార్ట్ పేరుతో అతని పేరును ఫీడ్ చేసుకుంది తన సెల్ పోన్ల్ చాందిని. ఆ విషయం తెలుసుకోలేని తల్లిదండ్రులు ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు. ముందే జాగ్తత్తలు తీసుకుంటే ఈ కథ రాయాల్సిన అవసరం వచ్చేది కాదన్నది నిజం.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*