శంకర్ రావు మళ్లీ వచ్చేశాడు



Want create site? Find Free WordPress Themes and plugins.
        అక్రమాస్తుల కేసులో జగన్ కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన వారిలో కీలకమైన వ్యక్తి మాజీ మంత్రి , కాంగ్రెస్ నేత డాక్టర్ పి.శంకరరావు. నిత్యం మీడియాలో నానడం ఆయన నైజం. ఒక్కసారైన అలా మీడియాలో కనిపిస్తేనే నిద్రపట్టేదట. కానీ ఈ మధ్య అసలు కనిపించకుండా పోయారాయన. కాంగ్రెస్ ఓటమితోపాటు..తన పరాజయం ఆయన్ను బాగా కుంగదీసింది. అందుకే కొద్ది సంవత్సరాలుగా వెనుకబడిపోయారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈసారి తాను షాద్ నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని టిఆర్ఎస్ నేతలు అనడం అర్థం లేని వ్యాఖ్యలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని మండిపడుతున్నారు. 
        కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత జి. వెంకటస్వామి (కాకా) అల్లుడే శంకర్ రావు. ఆయన బావమరుదులైన వివేక్, వినోద్ లు టీఆర్ఎస్ లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య హయాంలో మంత్రిగా పని చేసిన శంకర్ రావు…తోటి మంత్రులైన సబితాఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతి మంత్రుల పై చర్యలు తీసుకోక పోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సంచలనం రేపాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నాలుగు సార్లు షాద్ నగర్, 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గెలిచాడు. మరోసారి షాద్ నగర్ నుంచే పోటీ చేస్తానని తాజాగా చెప్పాడు శంకర్ రావు.
       దీంతో వృద్ధ కాంగ్రెస్ సింహం మళ్లీ వచ్చిందిరో అంటున్నారు స్థానిక నేతలు. నిత్యం సోనియాగాంధీ జపం చేసే ఆయన ఇప్పుడు అదే మాట చెబుతున్నారు. తనను పార్టీ ఎలా వినియోగించుకుంటే అలా ఉపయోగపడతానని చెబుతున్నాడు. తిరుమల తిరుపతిలో వికలాంగులకు, వృద్ధులకు దైవదర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హైకోర్టు జడ్జికి రాసిన లేఖను సుమోటోగా తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు శంకర్‌రావు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



1 Comment

Leave a Reply

Your email address will not be published.


*