బిగ్ బాస్ లో ఉత్సాహం, ఉద్వేగం



Want create site? Find Free WordPress Themes and plugins.
ఉత్సాహంగా సాగే బిగ్ బాస్ షోలో కాస్తంత ఉద్వేగం ఆవరించింది. ఏడు వారాల తర్వాత కుటుంబ సభ్యులను హువుస్ లో చూసే సరికి పార్టిసిపెంట్స్ ఆనందం ఆగలేదు. మరికొందరికి కన్నీరు కట్టలు తెంచుకుంది. తొలిగా శివబాలాజీ భార్య హవుస్ లో అడుగు పెట్టారు. అప్పటికే ఆటలో భాగంగా ఫ్రీజ్ లో ఉన్నారు అతను. ఈ లోపే తన భార్యను అక్కడ చూడటంతో కాస్తంత ఉద్వేగానికి గురయ్యారు. ఆమెను హత్తుకుని వదల్లేదు. ఆ తర్వాత అంతా సర్దుకుంది. ఆమె చాలా సరదాగా అందరితో మాట్లాడి వెళ్లారు. ఈ లోపే తమ కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చి అర్చన, దీక్ష, ఆదర్శ్ లు కన్నీరు కార్చారు. మరికొద్ది సేపటికే ఆదర్శ్ సతీమణి అక్కడకు వచ్చారు. అది చూసి ఆదర్శ్ తట్టుకోలేక పోయారు. కానీ నిమిషం లోపే ఆమెను బిగ్ బాస్ బయటకు పిలవడంతో ఆదర్శ్ ఆగలేకపోయారు. చేతిలో వారి పిల్లోడు ఫోటోలతో పాటు.. చిన్న మెసేజ్ రాసి పెట్టిందామె. 
                      ఇక తన వారిని ఇప్పట్లో కలుసుకోలేనని భావించిన ఆదర్శ్ నిరాశలో కూరుకుపోయాడు. కానీ మరోసారి ఆయన భార్య చిన్నోడుతో ఎంట్రీకి అవకాశం ఇచ్చి వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత వంతు అర్చనాది అయింది. తల్లిని చూసి అర్చన పెద్దగా ఏడ్చింది. ఆ ఎపిసోడ్ ఇంకా ప్లే కాలేదు. కమింగ్ అప్ లో ఉంది. 
                      బిగ్ బాస్ షో సభ్యులు ఆటలో భాగంగా ఫ్రీజ్ చేయడం, విడిపించడం, రివర్స్ నడవడం, ముందుకు పాస్ట్ గా వెళ్లడం, స్లో మోషన్ ఇలా రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్నారు. స్నానం చేసి వచ్చిన ఆదర్శ్, శివబాలాజీలు బట్టలు సరిగా వేసుకోకుండానే ఫ్రీజ్ లోకి వెళ్లడంతో కాస్తంత ఇబ్బంది పడ్డారు వాళ్లు. ఏ పొజిషన్ లో ఉన్న వారు అలానే కదలకుండా నిశ్చలంగా ఉండటం ఇబ్బందే. అలా నిశ్చలంగా ఉన్న అర్చనకు లిప్ స్టిక్ పూసి మరీ ఆనందించారు నవదీప్, హరితేజలు. అరటి పండు తింటున్న దీక్ష నోట్లో నములుతూనే అలా కాసేపు ఉండాల్సి వచ్చింది. వారి కుటుంబ సభ్యులను పిలిపించి మరీ కాసేపు గడిపేలా చేయడం బిగ్ బాస్ చేసిన మంచి ఆలోచన. ఇది వారిలో ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.
                       ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్‌లో మిగిలింది నవదీప్‌, శివబాలాజీ, అర్చన, హరితేజా, ఆదర్శ్‌, దీక్షాలు. ఈ వారం నామినేట్‌ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు. వీరిలో ఆదర్శ్, దీక్షాలను పంపించేయవచ్చని చర్చ సాగుతోంది. ఆఖరు వారానికి నవదీప్, శివబాలాజీ, అర్చన, హరితేజా మిగులుతారని ఎక్కువమంది భావిస్తున్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*