ఆ హీరోయిన్ తో తిరుగుతున్న నితిన్



Want create site? Find Free WordPress Themes and plugins.
అందాల తార మేఘా ఆకాష్. లై సినిమాలో నితిన్ కు జోడిగా నటించింది. కానీ ఆ సినిమా ప్లాప్ అయినా నితిన్ ఆమెను వదిలి పెట్టలేదు. చాలా ఫంక్షన్లకు ఇద్దరూ కలిసే వెళుతున్నారు. భాగ్యనగరంలో హుషారుగా తిరుగుతున్నారు. మేఘా ఆకాష్ తండ్రి తెలుగు వారే. కానీ తల్లి మళయాళీ. తెలుగు మాట్లాడటం కొద్దిగా వచ్చు ఆ భామకు. సాధారణంగా నితిన్ పెద్దగా అమ్మాయిలను పట్టించుకోరు. ఈ అమ్మాయిని చూశాక పీకల్లోతు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. పెద్దలతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఫైయిల్ అయినా నిజ జీవితంలో కలిసిపోయేందుకు వారు సిద్దమవుతున్నారనే చర్చ ఇప్పుడు పిల్మ్ నగర్ లో చక్కర్లుకొడుతోంది. 
     లై సినిమా ఊహించని విధంగా బోల్తా కొట్టింది. ఇది నితిన్ ను బాగా నిరాశలో ముంచెత్తింది. దర్శకుడు హను రాఘవపూడి బాగానే కష్టపడ్డా ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. కాని నితిన్ లోని నటుడికి మంచి మార్కులు పడ్డాయి. ఇందులో నటించిన మేఘా ఆకాష్ బాగానే నటించింది. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. తమిళ సినిమా ఒరు పక్కా కథై సినిమాతో తెరకు పరిచయమైంది మేఘ ఆకాష్. నితిన్ నటించబోయే సినిమాలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ని తీసుకోమని పర్సనల్ గా రికమండ్ చేస్తున్నారట. దిల్ వాలే పేరుతో రూపొందే నితిన్ సినిమాకు సంబంధించిన సమాచారం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*