కాపు ఎన్నారైని ముద్ర‌గడ ముంచాడాWant create site? Find Free WordPress Themes and plugins.
తనను పాదయాత్రకు అనుమతించే వరకు ఇంటి నుంచి బయటకు రానని తెగేసి చెప్పారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. చాలా సార్లు పాదయాత్ర చేసేందుకు బయటకు రావడం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. కాపు ఉద్యమం కోసం తాను త్యాగం చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన హఠాత్తుగా రూటు మార్చారు. ఇంటి నుంచి బయటకు రావడమే కాదు.. తన వియ్యంకుడి కోసం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను తీసుకుని మరీ టీడీపీ నేతను కలవడం వెనుక పెద్ద కారణమే ఉంటుందని అంతా అనుకున్నారు. తీరా అసలు విషయం ఏంటంటే.. తన వియ్యంకుడి కోసమే ఆయన గోరంట్లను కలిశారని తెలుస్తోంది. 
                ముద్రగడ వియ్యంకుడి పేరు బార్ల‌మూడి ర‌వికుమార్. రాజ‌మ‌ండ్రి నివాసం. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పట్టడంతో భూములకు విపరీతమైన భూమ్ వచ్చింది. అందుకే త‌న‌కు చెందిన ఓ భూమిని డెవ‌ల‌ప్‌మెంట్ చేద్దామని ఓ ఎన్నారై ను ఆశ్రయించారు. ఇద్దరి మధ్య జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఆ భూమిలో అపార్ట్ మెంట్లు నిర్మించి ఇచ్చినందుకు గాను 75 ప్లాట్లను ఇచ్చేందుకు వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు అడ్వాన్స్‌, స‌ద‌రు భూమి అపార్ట్‌మెంట్ల నిర్మాణం, ఆ భూమికి క‌ట్టాల్సిన ప‌న్నులు అన్నీ రవికుమార్ చూసుకోవాలి. కానీ రవికుమార్ ఆ పని చేయలేదు. దీంతో ఎన్నారై ఆ అనుమతులతో పాటు.. డబ్బులు చెల్లించాడు. నిర్మాణ ప‌నులు ఆగుతాయనే ఆందోళ‌న‌తో ఆ ఎన్నారై వాటిని చెల్లించారు. అంతా లెక్కలు రాసుకున్నారు. 
                           ఈ లోపే రవికుమార్ కు కొత్త ఆలోచన వచ్చింది. డెవలప్ మెంట్ చేసిన అపార్ట్ మెంటులోని 18 ప్లాట్లను అమ్మేశారాయన. కానీ ఒక్క మాట కూడ ఆ ఎన్నారైకు చెప్పలేదు. దీంతో బిత్తరపోవడం ఎన్నారై వంతు అయింది. ఒప్పందంలో భాగంగా 75 ప్లాట్లను ఆయనకు కేటాయించాలి. మిగిలినవి రవికుమార్ తీసుకోవాలి. నిర్మాణం పూర్తిగా కాకముందే అదీ ఎన్నారైకు తెలియకుండా ప్లాట్లను అమ్మడం వివాదాన్ని రేపింది. దీంతో ఎన్నారై సదరు రవికుమార్ తో మాట్లాడారు. అయినా లైట్ తీసుకున్నాడాయన. దీంతో ఎన్నారై కోర్టు గడప తొక్కారు. భూమి హక్కుల ప్రకారం తనకు న్యాయంగా రావాల్సిన 75 ప్లాట్లను ఇప్పించాలని కోరారు. తనకు ఆ ప్లాట్లు ఇచ్చే వరకు ఎలాంటి క్రయ, విక్రయాలు జరపవద్దని కోరారు. 
                            ఎన్నారై వాద‌న‌ను విన్న కోర్టు స‌ద‌రు ఫ్లాట్ల విక్ర‌యాల‌ను నిలిపివేస్తు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఫ్లాట్ల‌ను అమ్మడానికి, కొనడానికి వీలు లేదని స్టే విధించింది. అప్పటికీ గానీ రవికుమార్ కు అసలు విషయం బోధ పడలేదు. ఇన్నాళ్లు తాను చెప్పినట్లే నడుచుకునే ఎన్నారై న్యాయం కోసం కోర్టు గడప తొక్కడం ఆయనకు ఇష్టం లేకపోయింది. అనేక రకాలుగా ఒత్తిడి చేయడం ప్రారంభించారని తెలుస్తోంది. అదే సమయంలో ఆ 18 ప్లాట్లను ఒక్కోటి రూ. 36 లక్షలకు కొనుగోలు చేసి వారు రంగంలోకి వచ్చారు. ఆ ఫ్లాట్లకు డబ్బులు చెల్లించాం. రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. ఇందుకు ముద్రగడ వియ్యంకుడి రవికుమార్ తటపటాయించారు. 
                            ఆ తర్వాత వారు మరింతగా ర‌వికుమార్ కు ఒత్తిడి పెంచారు. ఇక చేసేదేమి లేక ఆయనని వారిని ఫ్లాట్ల వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. కోర్టు స్టే విధించినప్పటికీ బేఖాతరు చేశారు. ఆ ఫ్లాట్ల తలుపులకు వేసిన తాళాల‌ను ప‌గుల‌ గొట్టించార‌ని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎన్నారై మరోసారి కోర్టుకు వెళ్లాడు. కోర్టు చెప్పినా రవికుమార్ వినడం లేదని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఒప్పంద ప‌త్రాల‌ను కోర్టుకు సమర్పించాడు. 
                      రవికుమార్ ఒప్పందాన్ని ఉల్లంఘించార‌ని రూ. 30 కోట్ల వ‌ర‌కు సదరు ఆస్తి విలువ ఉంటుంద‌ని విన్నవించారు. కోర్టు బిల్డ‌ర్‌ వాద‌నతో ఏకీభవించింది. ఎన్నారై బిల్డ‌ర్‌ ఖ‌ర్చు చేసిన మొత్తాన్ని చెల్లించాల‌ని, అదే స‌మ‌యంలో 18 ఫ్లాట్ల విక్ర‌యాలు చెల్ల‌వ‌ని ర‌వికుమార్‌కు తేల్చి చెప్పింది. దీంతో ముద్రగడ వియ్యంకుడికి ఏం చేయాలో తోచలేదు. కాపు ఉద్యమం కోసం ఇంటి నుంచి బయటకు రాకుండా ఆందోళన చేస్తున్నాడు ముద్రగడ. ఆయన్ను కలిసి విషయం వివరించాడు. తప్పు చేసిన వియ్యంకుడిని మందలించాల్సిన ముద్రగడ ఏకంగా ఆ ఎన్నారై పై ఒత్తిడి పెంచే పని చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌తో మాట్లాడారు. ఆ తర్వాత వివాదాన్ని కోర్టు బ‌య‌టే సెటిల్ చేసుకోవాల‌ని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ నుంచి ఎన్నారైకు ఒత్తిడి వ‌చ్చింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆ ఎన్నారై టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల‌ బుచ్చయ్య వద్దకు వెళ్లారు. 
                     జరిగిన విషయాన్ని చెప్పి త‌న‌కు న్యాయం చేయాల‌ని వేడుకున్నారు. బంతి గోరంట్ల చేతిలో పడటంతో ముద్ర‌గ‌డ తన వియ్యకుండి కోసం తప్పని సరి పరిస్థితుల్లో బుచ్చ‌య్య‌ను క‌లిశారు. మొత్తం నాలుగు గంటల పాటు వారు మంతనాలు చేశారు. ఇంకేముంది ముద్రగడ పార్టీ మారతున్నాడని ప్రచారం వచ్చింది. కానీ అసలు విషయం ఇదేనంటున్నారు చాలా మంది. ఎన్నారైకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని గోరంట్ల చెప్పడంతో ఇప్పుడు ముద్రగడ ఏం చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. అదండీ అసలు విషయం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

Leave a Reply

Your email address will not be published.


*