దర్శకుడు మారుతి ‘మంచోడు’



Want create site? Find Free WordPress Themes and plugins.
దర్శకుడు మారుతీ అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీస్తాడు. నిర్మాతలకు నాలుగు రూపాయల లాభం చూపిస్తాడు. ఎవరినీ పెద్దగా ఇబ్బంది పెట్టడు. చిన్న హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ అందుకుంటాడు. యూత్ ని అట్రాక్టు చేయడంలో సిద్ధహస్తుడు. ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రమ్, కొత్త జంట, భలె భలే మగాడివోయ్ వంటి సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి.  
                        నాని తో తీసిన భలే భలే మగాడివోయ్ సినిమా అంచనాలు మించి ఆడింది. మారుతీతో సినిమా తీస్తే సక్సెస్ ఉంటుందని అనుకున్నారు. కానీ  విక్టరీ వెంకటేష్ తో చేసిన బాబు బంగారం నిరాశను మిగిల్చింది. పెద్ద హీరోను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. కథనం విషయంలోను పొరపాట్లు జరిగాయి. ఫలితంగా ఆ సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. అందుకే మళ్ళీ  మహానుభావుడుతో తెరమీదకు రానున్నాడు. 
                        శర్వానంద్ ని సరికొత్తగా చూపిస్తూ ఆ సినిమా తెస్తున్నారు. అతి శుభ్రత పాటించే రుగ్మత ఉన్న పాత్రలో చూపించడం బాగా ఆకట్టుకుంటోంది. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా సినిమా తీసానని చెప్పాడు మారుతీ. స్పైడర్ విడుదలకు రెండు రోజుల ముందే తన సినిమాను మార్కెట్ లోకి తేనున్నాడు. ఇది పూర్తి కాక ముందే నాగ చైతన్యతో మరో మూవీ చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మూవీకి ‘మంచోడు’ అనే పేరు నిర్ణయించినట్లు సమాచారం. సితార ఎంటర్ టైయిన్ మెంట్ బ్యానర్ పై రూపొందే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తైయింది. తెలుగు పేర్లను ఎక్కువగా వాడే మారుతీ తన సినిమాలో ఆ మార్క్ చూపిస్తాడు. 
                        మచిలీపట్నంకు చెందిన మారుతి తండ్రి అరటి పళ్ల వ్యాపారం, తల్లి ట్రైలరింగ్ చేసి అతన్ని చదివించారు. తాను మొదట్లో వాహనాలకు స్టిక్కరింగ్ చేసేవాడు. తనకున్న అభిరుచితో సినిమాల్లోకి వచ్చి మంచి చాన్స్ లు కొట్టాడు. ఇప్పుడు తల్లిదండ్రులెవరు మరో పని చేయకుండా చూసుకుంటున్నాడు. అదే సమయంలో సాధారణ జనాలకు ఏది నచ్చుతుందో.. ఏది నచ్చదో తెలిసిన వాడిలా సినిమాలు తీయడం అతనికే చెల్లింది. అందుకే నమస్తే ఆంధ్రా అతనికి బెస్ట్ ఆప్ లక్ చెబుతోంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*