కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి



Want create site? Find Free WordPress Themes and plugins.
టీడీపీలో చేరనున్నారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డి. చిత్తూరు జిల్లా పీలేరు నియోజవర్గాన్ని ఆయనకు కేటాయించనున్నారని తెలుస్తోంది. ఇప్పుడు పీలేరు ఎమ్మెల్యేగా వైకాపా నేత చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన పార్టీ మారేందుకు సిద్దమనే సంకేతాలిచ్చినా ఆలస్యమవుతోంది. అందుకే కిరణ్ సోదరుడు తొందరపడుతున్నారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్థిగా గతంలో చెప్పుల గుర్తు పై పోటీ చేసిన నల్లారి కిషోర్ బరిలోకి దిగనున్నారు. 
         తమ్ముడ్ని టీడీపీకి పంపాక.. నిదానంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ గడప తొక్కుతారట. ఈ మేరకు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. జనవరిలో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో కిరణ్ ను ఎంపీగా పార్లమెంటుకు పంపేందుకు సిద్దమైందట టీడీపీ. అంతే కాదు… టీడీపీకి మరో మంత్రి కావాలని బీజేపీని అడుగుతున్నారు సి.ఎం చంద్రబాబునాయుడు. ఆ సీటు కిరణ్ కు ఇస్తారంటున్నారు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏనే తిరిగి గెలుస్తుందనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు.. అప్పుడు తిరిగి ఎన్డీఏ కూటమి వచ్చినా కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రిపదవి ఉండేలా ఒప్పందం చేసుకుంటున్నారనేది ఇన్నర్ టాక్. ఇందులో వాస్తవం ఎంత వరకు అనేది తెలియదు. 
        ఇటు టీడీపీ, అటు కిరణ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇదే. కిరణ్ మరో తమ్ముడు సంతోషరెడ్డి ఎలాగు ఐన్యూస్ వ్యవహారాలతో పాటు.. వ్యాపారాలను చూస్తున్నాడు. అన్నలిద్దరు రాజకీయాల్లోకి వెళితే ఆ తర్వాత తన సంగతి చెబుతానంటున్నారట సంతోష్. కిరణ్ చాలా కాలంగా టీడీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతున్నా ఆచి తూచి అడుగేయాలని చూస్తున్నారట. అందుకే ఆలస్యమవుతుందని చెబుతున్నారు అనుచరులు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*