టీడీపీలోకి జంప్ చేయనున్న జేడీ శీలం



Want create site? Find Free WordPress Themes and plugins.
కేంద్ర మాజీ మంత్రి. కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం. కర్నాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. గుంటూరు జిల్లాకు చెందిన ఈ నేత పూర్వాశ్రమంలో 15 ఏళ్ల పాటు కలెక్టర్ గా.. పలు కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. ఐఏఎస్ సర్వీసులకు గుడ్ బై చెప్పి, రాజకీయాల్లో చేరి ఎంపీగా కొనసాగుతున్నాడు. కేంద్ర మంత్రిగాను పని చేశారు. ఇప్పుడు ఆయన చూపు హస్తం పార్టీ నుంచి టీడీపీ వైపు మళ్లింది. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదు జనాలు. దీంతో కాంగ్రెస్ లో ఉంటే తన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని గ్రహించినట్లున్నారు. అందుకే ఏపీ సెక్రటేరియట్ వద్దకు తరచూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారని అడిగితే సి.ఎం చంద్రబాబుతో కొన్ని విషయాలు చర్చించాల్సి ఉంది. అందుకే వస్తున్నాను అంటూ సమాధానం చెబుతున్నారు. 
         కాంగ్రెస్ నుండి టీడీపీలోకి చేరేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నారని.. కానీ ఇంకా చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదంటున్నారు. అందుకే తరచుగా సచివాలయం వైపు వచ్చి వెళుతున్నారనే చర్చ సాగుతోంది. జేడీనే కాదు.. చాలా మంది కాంగ్రెస్ నేతల చూపు ఇప్పుడు మిగతా పార్టీల పై ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చే వీలుంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*