ఇరుకున పడ్డ గుత్తా 



Want create site? Find Free WordPress Themes and plugins.
ఎవరు తీసుకున్న గోతిలో వారు పడతారంటే ఇదేనేమో. టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి ఇలానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వేసిన పిటిషన్ టీఆర్ఎస్ లోకి వచ్చాక ఉప సంహరించుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు కోర్టు ఒప్పుకోలేదు. మీ ఇష్టం వచ్చినప్పుడు పిటిషన్ వేయడం, ఆ తర్వాత విరమించుకోవడం మంచి పద్దతి కాదంది. మీ రాజకీయాల కోసం కోర్టు సమయాన్ని వృధా చేస్తారా అంటూ గుత్తాకు చీవాట్లు పెట్టింది. దీంతో గుత్తా ఎరక్క పోయి ఇరుక్కున్నాను అంటున్నాడు. 
                   తెలంగాణకు చెందిన కొందరు నేతలను పార్లమెంటరీ కార్యదర్శలుగా నియమించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తు కోర్టు గడప తొక్కారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి. దీనిపై హైకోర్టు స్పందించింది. కాంగ్రెస్‌ నుంచి అధికార టీఆర్‌ఎస్‌ లోకి వెళ్లకముందు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తామని చెప్పింది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చుకోవడానికి వీల్లేదని చెప్పింది. మీకు నచ్చనప్పుడు కోర్టులో వ్యాజ్యాలు వేసి, నచ్చినప్పుడు ఉప సంహరించుకుంటామంటే కుదరదని చెప్పింది. పలువురికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిల్‌ను ఉప సంహరించుకునేందుకు ఒప్పుకోలేదు. 
                   హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పుడు వివిధ హోదాల్లో ఉన్న పలువురికి కేబినెట్‌ హోదానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ ఆయన 2015లో పిల్‌ దాఖలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం పలువురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జీవో జారీ చేసింది.
                   ఇప్పుడు ఇది హాట్ టాపికైంది. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని భావిస్తే ఎంపీకైనా జరిమానా విధించే అవకాశముంది. అదే సమయంలో పలువురి కేబినెట్ పదవులను క్రియేట్ చేసినట్లు ఇచ్చిన జీవో పై తీర్పునిచ్చే అవకాశముంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*