రఘవీరాకు ఢిల్లీ నుంచి పిలుపు



Want create site? Find Free WordPress Themes and plugins.
      ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘవీరారెడ్డికి హస్తిన నుంచి పిలుపు వచ్చింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మండిపడుతున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఏపీకి వచ్చిన తెల్లారే సోనియాగాంధీ నుంచి పిలుపురావడం ఇప్పుడు హాట్ టాపికైంది. ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్లు రఘవీరారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఏపీ విభజన విషయంలో సోనియాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతోనే కాంగ్రెస్ దారుణ పరాజయం అన్న సంగతి తెలిసిందే. పార్లమెంటు తలుపులు మూసేసి మరీ విభజన బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదింపజేశారు. కానీ ఇప్పుడు తన తప్పు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు సోనియమ్మ. నంద్యాల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు వస్తాయి..ఏంటనే విషయం పై ఆరా తీశారామె. కానీ తీరా ఓట్లు 15 వందలు దాటకపోయే సరికి సోనియాగాంధీ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు సమాచారం.
 
       అందుకే రఘవీరారెడ్డిని పిలిచి మాట్లాడిన సోనియాగాంధీ అవసరమైతే మరొకరికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ ను తిరిగి బతికించడం అంత తేలిక కాదు. అందుకే ఎవరికి వారే బాధ్యతలు తీసుకునేందుకు మొగ్గు చూపడం లేదు. డిగ్గీరాజా తీరుతో విసుగు చెందిన సోనియాగాంధీ..తెలంగాణ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. ఇప్పుడు ఏపీ బాద్యతల నుంచి ఆయన్ను పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బెజవాడలోని ఆంధ్రరత్నా భవన్ లో పిసిసి కార్యవర్గం సమావేశమైనా…పెద్దగా చర్చించింది ఏం లేదు. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు కార్యక్రమాలు రూపొందించడం తప్ప..వారి నుంచి స్పందన ఉండటం లేదు. ఫలితంగా కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురవుతోంది.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*