కుంభ‌కోణం లో బాల‌కృష్ణ 102 సినిమా షూటింగ్‌Want create site? Find Free WordPress Themes and plugins.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం కుంభ‌కోణంలో షూటింగ్ జ‌రుపుకొంటున్న ఈ మూవీకి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్క‌డ జ‌ర‌గుతున్న భారీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల‌తో పాటు, పోరాట ఘ‌ట్టాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాలుపంచుకొంటుందట. బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటించనుండగా మ‌రో నాయిక‌గా న‌టాషా దోషీ ఎంపికైన సంగ‌తి తెలిసిందే.  ప్రకాష్ రాజ్,  మురళీమోహన్, బ్రహ్మానందం, జయ‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు ఎం.రత్నం, కళ నారాయణ రెడ్డి, పోరాటాలు అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ రాంప్రసాద్, సంగీతం చిరంతన్ భట్, సహ-నిర్మాత సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వరుణ్-తేజలు అందిస్తున్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*