కేసీఆర్ సర్కారుకు చుక్కెదురు



Want create site? Find Free WordPress Themes and plugins.
       మేం ఏ మంచి పని చేసినా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. వారి తీరు మారాలని తెలంగాణ సిఎం కేసీఆర్ తరచుగా మాట్లాడే మాట. కాస్త కోపం వచ్చిన సందర్భంలో సన్నాసులు, దద్దమ్మలు, కొడుకులు వంటి పద ప్రయోగాలు చేసి స్వపక్షంలో సంబరాన్ని విపక్షంలో వ్యతిరేకతను తెచ్చుకుంటాడు కేసీఆర్. ఇప్పుడు ఆయన చేస్తున్న కీలక నిర్ణయానికి కోర్టు అడ్డు చెప్పింది. రైతు సమన్వయ సమితుల పేరుతో ఆయన ఏర్పాటు చేస్తున్న కమిటీల పై ఎదురు దెబ్బ తగిలింది. ఆ సమితికి కేటాయించిన రూ.500 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు..ఏం చేస్తారనే అంశం పై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. అదే సమయంలో వాటి సంగతి చెప్పాకనే మిగతా వాటిని విడుదల చేయాలని కోరింది. 
       ఈ సమన్వయ కమిటీలే రూ. 4 వేల వరకు రైతులకు పెట్టుబడి కింద రుణాలను ఇవ్వనున్నారు. రైతులకు ఎరువులు, పురుగు మందులు అందేలా చూడటం, బ్యాంకు రుణాలను ఇప్పించడం వంటి పనులన్నింటినీ చేస్తాయని చెప్పారు కేసీఆర్. ఇందుకు జీవో-39 ని విడుదల చేశారు. ఈ కమిటీలు రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి వారికి మంచి గిట్టుబాటు ధరలు కలిపించేలా చేస్తారని ప్రకటించారు. కానీ కమిటీల్లో గులాబీ నేతలే ఉండటంతో సమస్య కోర్టు వరకు వెళ్లింది. టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు సంపాదించుకునేందుకే ఈ సమితిలు తెస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే ఈ జీవో ని సవాలు చేస్తూ తెలంగాణా ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ మనోహర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతు సంఘాల ఏర్పాటులో రాజకీయ కోణం ఉందని చెప్పారు. నాయకుల కమీషన్ల కోసమే జీవో-39 ను తీసుకొచ్చారని ఆ పిటిషన్ లో ప్రస్తావించారు. 
     దీంతో మూడు వారాల్లోపు కోర్టుకు ప్రభుత్వం అసలైన వివరాలు అందించాలని కోరింది. అప్పటి వరకు ఎలాంటి నియామకాలను చేయవద్దని చెప్పింది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*