కేసీఆర్ ఉప ఎన్నికలు తెస్తారా…



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ సిఎం కేసీఆర్ ఉప ఎన్నికలను తీసుకు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నల్గొండ ఎంపీ స్థానం నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డితో ఎంపీ సీటుకు రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారట కేసీఆర్. కాంగ్రెస్ కీలక నేతలంతా నల్గొండ జిల్లా వారే. సిఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రామిరెడ్డి దామోదరరెడ్డి వంటి వారంతా నల్గొండ జిల్లాకు చెందిన వారే. అక్కడ గులాబీ నేత ఎంపీగా గెలవడం ద్వారా హస్తం నేతల నోళ్లు మూయించవచ్చనే ఆలోచిస్తున్నట్లు సమాచారం వస్తోంది. మరోవైపు పాలమూరు జిల్లాలో మరో అసెంబ్లీ సీటును ఖాళీ చేయించి టీఆర్ఎస్ నేతను పోటీ చేయిస్తారట. 
             ఇలా ఉప ఎన్నికల్లో గెలుపు ద్వారా విపక్షం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఆలోచన చేస్తున్నారట. నంద్యాల, కాకినాడలలో గెలుపుతో టీడీపీలో ఉత్సాహం వచ్చింది. అలానే టీఆర్ఎస్ శ్రేణుల్లోను ఉత్సాహం వచ్చే చర్యలు తీసుకుంటున్నారట కేసీఆర్. అందుకే ఇప్పుడు ఉప ఎన్నికలకు ఎదుర్కునేందుకు సిద్ధమయ్యారని సమాచారం. రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా గుత్తాను నియమించే అవకాశముంది. ప్రతి గ్రామం, మండలం, జిల్లాల్లో రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేస్తోంది కేసీఆర్ సర్కారు. 
            రైతు సమస్యలను పరిష్కరించడంతో పాటు.. వారికి రూ.8 వేలను పెట్టుబడి కింద ఇవ్వనుంది ప్రభుత్వం. అవి వారికి అందేలా చూసే బాధ్యత సమితిల పైనే పడింది. అందుకే వాటిని సమన్వయం చేసేందుకు అనుభవం ఉన్న గుత్తాను ఆ పదవిలో కూర్చోపెడతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సెమీ పైనల్స్ గా పరిగణించే ఉప ఎన్నికల విషయం పై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*