అందుకోసమే టీడీపీతో ముద్రగడ చర్చలు



Want create site? Find Free WordPress Themes and plugins.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపికైంది. చంద్రబాబు ప్రభుత్వంపై ముద్రగడ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఓ సాయం కోసం బుచ్చయ్య చౌదరి ఇంటికి ముద్రగడ వెళ్లారంటున్నారు. తన వియ్యంకుడి భూమికి సంబంధించిన వివాదంపై చర్చించడానికి ముద్రగడ వెళ్లినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి నాలుగు గంటలకు పైగానే వారు చర్చించారు. రాజమండ్రి రైల్వేస్టేషన్ ఎదురుగా రవికుమార్ కు ఉన్న స్థలంలో అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పడిన ఒక వివాదంపై వారు చర్చించారు. 
                    కానీ రాజకీయ పరమైన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని ముద్రగడ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాకినాడలో తాను టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఉంటే ఫలితాలు మరోలా వచ్చేయని ముద్రగడ అన్నారు. ఇప్పుడు అదే పార్టీ వారి వద్దకు వెళ్లి సాయం కోరడంతో తెర వెనుక ఏం జరుగుతుందోనన్న చర్చ సాగుతోంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*