సెప్టెంబర్ 17  పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ టీడీపీ



Want create site? Find Free WordPress Themes and plugins.
      సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని, ఉత్సవాలు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కానీ తెలంగాణ టీడీపీ మాత్రం విమోచన దినోత్సవం కాకుండా విలీన ఉత్సవంగా నిర్వహించాలంటోంది. మరోవైపు టీఆర్ఎస్ ఈ రెండు ఉత్సవాలను జరిపేందుకు సిద్దంగా లేదు. అధికారంలోకి రాక ముందు ఒక మాట. వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు సి.ఎం కేసీఆర్. నిజాం రజాకార్ల ఆగడాలకు బలైన తెలంగాణకు విముక్తి లభించిందని..అందుకే ఉత్సవం నిర్వహించాలని గతంలో కేసీఆర్ కోరారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. 
       అలా డిమాండ్ చేస్తే ఎంఐఎం పార్టీ నుంచే కాకుండా ముస్లిం ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే కేసీఆర్ ఆలోచన. రానున్న ఎన్నికల్లో గెలవాలంటే విలీన, విమోచన ఉత్సవాలకు దూరంగా ఉండాలనేది కేసీఆర్ వ్యూహంగా ఉంది. వాస్తవంగా విలీన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ నిర్వహించడానికి కేసిఆర్ కు అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. అందులో దాచి పెట్టడానికి ఏం లేదు. చరిత్రను దాచి పెట్టే ప్రయత్నం చేసినా ఆగదు. రాజకీయాలు, ఓటు బ్యాంకుల కోసం మాట తప్పడం సమంజసం కాదంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామపక్షాలు. ఇది టీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేశాయి.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*