మార్కంటి బాబు కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ చేయూత



Want create site? Find Free WordPress Themes and plugins.
      
     బహరేన్ లో మృతిచెందిన మార్కంటి బాబు కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ 1,20,309/- రూపాయల ఆర్ధిక సహయాన్ని అందచేసారు. తెలంగాణ కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు బహరేన్ లో ఒక ప్రైవేట్ కంపెనీ లో పని చేసేవారు. విదులు నిర్వహిస్తూ బాబు 8 ఆగస్ట్ 2017న అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. వారి పార్తివ దేహాన్ని మృతిచెందిన 15 రోజులలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో 23 ఆగస్ట్ 17న స్వగ్రామానికి పంపించారు. వారికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. దీన్ని చూసి ముందుకు వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, మరి బాబు, తోటి కంపనీ లో పనిచేసే కార్మికులు, వారి ట్రాన్స్‌పోర్టేషన్‌ ఆఫీసర్ శివరాజ్ ప్రభు వారి ఆద్వర్యంలో  ఆర్థిక సాయంగా 1.20 లక్షల రూపాయలు, ఆ బాదిత కుటుంబానికి బ్యాంక్ ద్వారా అందచేసారు.     
        ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీ డా రవి, సెక్రెటరీలు రవిపటేల్ దెషెట్టి, సుమన్ అన్నారం, జాయంట్ సెక్రెటరీలు గంగాధర్ గుమ్ముల, సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్ ఆకుల, నర్సయ్య, Ch రాజేందర్, వినోద్, సాయన్న, వసంత్ తదితరులు దీనికి కృషి చేశారు.
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*