చంద్రబాబుతో లగడపాటి భేటీ



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. బెజవాడ మాజీ ఎంపీ. రాష్ట్ర విభజన బిల్లు పై పార్లమెంటులో చర్చ జరిగేటప్పుడు పెప్పర్ స్ర్పై చేసిన నేత. ఏపీ విభజన అయితే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పాడు. అదే చేశాడు. రాజకీయాల్లో లేకపోయినా లగడపాటి గురించి బాగానే చర్చ సాగుతోంది. సర్వేల పేరుతో ఆయన ఎప్పుడూ వార్తల్లో నానుతుంటాడు. నంద్యాల, కాకినాడ ఎన్నికల పై ముందే లగడపాటి తన జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల్లోను టీడీపీదే విజయమని ఇప్పటికే తన సర్వేల ద్వారా చెబుతున్నాడు. దీంతో లగడపాటి సర్వేల పై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడే కాదు..గతంలో చెప్పిన చాలా సర్వేలు నిజం కావడంతో లగడపాటి మాట మీద నమ్మకం కుదురుతోంది జనాలకు. 
      ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో లగడపాటి రాజగోపాల్‌ సచివాలయంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పిలిస్తేనే తాను వచ్చానని చెప్పారు లగడపాటి. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ప్రస్తావించారాయన. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల తర్వాత తాను ఎలాంటి సర్వేలు చేయలేదని లగడపాటి తెలిపారు. లగడపాటి  గతంలోను రెండు సార్లు చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం అయిన సంగతి తెలిసిందే. 
     సర్వేలతో పాటు..కొన్ని రాజకీయ సమీకరణలు తెలుసుకునేందుకు చంద్రబాబు పిలిపించారనే చర్చ సాగుతోంది. అదే సమయంలో కొన్ని సర్వేల బాధ్యతలను లగడపాటికి చంద్రబాబు అప్పగించారని..పైకి అదేం చెప్పడం లేదంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*