కంచె ఐలయ్యను చంపేస్తామని బెదిరింపులుWant create site? Find Free WordPress Themes and plugins.
        కులాలను ఏకి పారేసే రచయిత కంచె ఐలయ్య. సామాజిక రచనలు ఆయనకు చాలా ఇష్టం. అవే ఇప్పుడు ఆయన కొంప ముంచుతున్నాయి. మోహమాటం లేకుండా ఆయన రాసిన రచనలను చదివిన వారు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు. అసలు ఫ్రొఫెసర్ కంచె ఐలయ్యను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తాను ఎప్పుడో రాసిన పుస్తకం చదివిన ఆర్యవైశ్య సంఘాలు ఇప్పుడు వివాదాస్పదం చేస్తున్నాయని ఆయన పోలీసు స్టేషన్ కు చేరారు. ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి ప్రెసిడెంట్ టీజీ భరత్ ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేదించాలని డిమాండ్ చేశారు. ఐలయ్యను అరెస్టు చేయాలని పలు సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టారు. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ కుమారుడే టిజి భరత్. రానున్న ఎన్నికల్లో తాను కర్నూలు నుంచే పోటీ చేస్తానని ముందే ప్రకటించి వివాదానికి తెరలేపారాయన. ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లోకి వచ్చాడు. ఐలయ్య  తీరును తప్పు పట్టారాయన. 
      ఐలయ్యను చెంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం వెనుక కారణం తాము కాదని చెప్పారాయన. ఈ ఘటనల నేపధ్యంలో ఐలయ్య ఓయూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తనకు వస్తున్న కాల్స్ లిస్ట్ ను పోలీసులకు ఇచ్చారాయన. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అసలు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపికైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

  1. polisulu aryavysya sanghalu icchina phiryadunu pattinchukoledu. kanche ilayya icchina phiryadu meedamathram appude daryapthu mosalaindi. idee nyayam.

Leave a Reply

Your email address will not be published.


*