బిగ్ బాస్ నుంచి వెళ్లి పోయిన ప్రిన్స్



Want create site? Find Free WordPress Themes and plugins.
      బిగ్‌బాస్ సీజన్ 1 చివరిదశకు చేరుకుంది. విజేత అవుతారని భావించిన ప్రిన్స్ ఈ షో నుంచి బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపికైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌‌ను తలిపించేలా సాగుతోంది బిగ్ బాస్ షో. ఎలిమినేషన్ కోసం ఆదర్శ్, ప్రిన్స్, నవదీప్‌లు పేర్లను పరిశీలించగా..చివరి నిమిషం వరకు ఆదర్శ్, ప్రిన్స్ లు పోటీ పడ్డారు. చివరకు ప్రిన్స్ బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఎక్కువ మంది హరితేజకు ఓటేయగా ఆ తర్వాత అర్చన, మూడోస్థానంలో నవదీప్, చివరిగా ఆదర్శ్, ప్రిన్స్ లు ఉన్నారు. ఓటింగ్ తక్కువ శాతం వచ్చిన ప్రిన్స్ ను బయటకు పంపారు.
       ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీని ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో కంటిన్యూ చేశారు. సభ్యులతో వెరైటీ కబడ్డీ ఆడించారు. ప్రిన్స్, శివబాలాజీ, అర్చనలు ఒక టీం కాగా.. ఆదర్శ్, హరితేజ,నవదీప్‌‌లు మరో గ్రూపు. కూతకు వెళ్లే వారు కబడ్డీ.. కబడ్డీ అని కాకుండా హౌస్‌లో ఉన్న తమకు ఇష్టమైన పేరును పిలవాలనే నిబందన పెట్టారు. దీక్ష లెగ్ బాగోలేక పోవడంతో ఆమె పాయింట్లు లెక్క పెట్టి చెప్పారు. గేమ్ మొదలు కావడంతోనే శివ.. శివ.. శివ’అంటూ కూత మొదలు పెట్టేసి శివబాలాజీని టచ్ చేసి తొలిపాయింట్ కొట్టేసింది అర్చన. చివరకు అర్చన టీమ్ గెలవగా… హరితేజ టీమ్ ఓడింది. 
      ఇక వెళుతూ వెళుతూ…దీక్ష పై బిగ్ బాంబు వేసి వెళ్లాడు ప్రిన్స్. ఏ పని చేయాలన్నా పాకుకుంటూ వెళ్లేలా ఆమెకు నిబంధన పెట్టారు. కనీసం బాత్ రూముకు వెళ్లాలన్నా..ఇదే నిబంధన ఉండటంతో వారం రోజుల పాటు ఆమె ఎలా వెళుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*