వయసు పెరుగుతున్న తగ్గని ఉదయభాను హుషారు



Want create site? Find Free WordPress Themes and plugins.
‘హార్లిక్స్ హృదయాంజలి’ పేరుతో ఈటీవీలో ప్రారంభమైన ప్రోగ్రామ్ తో ఉదయభాను బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది. కుర్రకారు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ తరువాత వన్స్ మోర్, సాహసం చేయరా ఢింభకా, రేలా రే రేలా, ఢీ వంటి  ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించింది. హోస్ట్ గా సినిమా ఫంక్షన్స్ ను తన మాటలతో అలరించింది. ఆ తర్వాత ఉదయభాను పెళ్లి చేసుకోవడం, కవల పిల్లలు పుట్టడం జరిగాయి. ఇటీవలనే ఉదయభాను తమ పిల్లల బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఆమె ‘నీతోనే’ అనే డాన్స్ షోలో కనిపించనుంది. ‘భాను ఈజ్ బ్యాక్’ అని స్టార్ మా టీవీ ఇప్పుడు ఒక వీడియోను విడుదల చేసింది. ఇక ఈ కార్యక్రమంలో ఉదయభాను చేసే సందడి ఏ స్థాయిలో ఉంటుందో దీన్ని చూస్తే అర్థమవుతోంది. రెండు దశాబ్దాల పాటు తెలుగు బుల్లితెరను ఏలిన రాణిగా ఉదయభానును చూడవచ్చు. ఇటీవలనే భర్త విజయ్ తోడుగా రాకా  సిఎం కేసీఆర్ ను కలిశారు ఉదయభాను. టీఆర్ఎస్ లో చేరే ఉద్దేశాన్ని చెప్పారంటున్నారు. ఇటు బుల్లితెర పై మరోసారి బిజీ అవ్వడమే కాకుండా.. అటు రాజకీయాల పైనా ఆసక్తి చూపిస్తుందామె. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*