కాకినాడ మేయర్ ఎవరంటే



Want create site? Find Free WordPress Themes and plugins.
      కాకినాడ నగర మేయర్ పీఠం దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్ల పోటీ మొదలైంది. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి కాకినాడ మున్సిపల్ మేయర్ పీఠం పై టీడీపీ ప్రతినిధి కూర్చోబోతున్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఈ నెల 16న ఎన్నిక జరగనున్నాయి. ఇందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఓసీ మహిళకు రిజర్వ్ అయిన మేయర్ పదవి రేసులో నలుగురి పేర్లు బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఎవరికి మేయర్ పదవి దక్కుతుందనే ఉత్కంఠ రేగుతోంది. 
       కాకినాడ  నగరపాలక సంస్థ ఎన్నికలలో విజయఢంకా మోగించిన టీడీపీ ఇప్పుడు మేయర్ అభ్యర్థి ఎంపిక కసరత్తు మొదలు పెట్టింది. కాకినాడ  మేయరు పదవిని ఓసీ మహిళకు రిజర్వు చేయడంతో కాపు సామాజిక వర్గానికి అది దక్కనుందని ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు ముందే డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఈ విషయాన్ని ప్రకటించారు. అదేమాటకు పార్టీ కట్టుబడి ఉన్నట్టు ఫలితాల తర్వాత చినరాజప్ప, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చెప్పారు.  
       దీంతో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 28వ డివిజన్‌ కార్పొరేటర్ సుంకర పావని, 8వ డివిజన్‌ కార్పొరేటర్  అడ్డూరి వరలక్ష్మి, 38 వ డివిజన్ కార్పొరేటర్ మాకినీడి శేషుకుమారి, 40వ డివిజన్ కార్పొరేటర్  సుంకర శివప్రసన్నలలో ఒకరికి మేయర్ పదవి దక్కనుంది. ఎవరికి వారే పెద్ద నేతల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. వారు నలుగురు పార్టీలో కీలక వ్యక్తులే కావడంతో మేయర్ పీఠం తమకే దక్కుతుందని వారు భావిస్తున్నారు. ఈ రేసులో మాకినేని శేషు కుమారి ముందంజలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం  ఆమె ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మంత్రి నారాయణ అండదండలు ఆమెకు ఉన్నాయని తెలుస్తోంది.
       మరోవైపు సుంకర పావని భర్త తిరుమల కుమార్ కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. సుంకర లక్ష్మిప్రసన్న భర్త సాగర్ నగర టీడీపీలో యనమల వర్గీయుడిగా ముద్ర పడ్డారు. సుంకర పావని, ఆడ్డూరి వరలక్ష్మీ శ్రీనివాస్ ఎమ్మెల్యే కొండబాబుకు అనుకూల వర్గం. సుంకర పావని కాకినాడ ఎంపీ తోటనరసింహం, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు , జ్యోతుల నెహ్రూ, డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా లకు దగ్గర బంధువు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మేయర్ అభ్యర్థిత్వం ఖరారు చేయడంలో కీలకం. ఈ ముగ్గురూ పార్టీ అధిష్ఠానానికే నిర్ణయం వదిలేశామని పైకి చెబుతున్నా ఎవరికి వారే తమ అభ్యర్థినిని గద్దెనెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలోఎవరికి చంద్రబాబు నాయుడు కిరీటం అప్పగిస్తారో వేచి చూడాలి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*