ఇర్మా హరికేన్ తో విలయంWant create site? Find Free WordPress Themes and plugins.
ఇర్మా, హ‌రికేన్ ధాటికి అమెరికా తల్లడిల్లుతోంది. కుండ‌పోత వ‌ర్షం, భీక‌ర‌మైన రాక్ష‌స గాలులు క‌రీబియ‌న్ దీవుల్లో విధ్వంసం సృష్టించాయి. 295 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు పెద్ద పెద్ద వృక్షాలను కూక‌టి వేళ్ల‌తో పెకిలించేశాయి. క‌రీబియ‌న్ దీవుల నుంచి ఇర్మా ఫ్లోరిడా వైపు క‌దులుతోంది. క‌రీబియ‌న్ దీవుల్లో కేట‌గిరి 5 గా ఉన్న ఇర్మా ఫ్లోరిడా వైపు కదులుతూ కేట‌గిరి 4గా మారి గంట‌కు 250 కి.మీల వేగంతో గాలులు వీస్తున్నాయి. హ‌రికేన్, ఇర్మా రెండు ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల‌ను వ‌ణికిస్తున్నాయి. మరోవైపు మెక్సికో తీరంలో 8.2 తీవ్ర‌తతో భూకంపం వ‌చ్చిన సంగతి తెలిసిందే. టొబాస్కో, ఒక్సాకా, చైపాస్ రాష్ట్రాల్లో భూకంప ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. దీని తీవ్రత వల్ల 200 మంది గాయ‌ప‌డి ఉంటార‌ని అంచనా. ఈ ప్రాంతంలో 8.2 తీవ్ర‌త‌తో భూకంపం రావ‌డం ఈ శ‌తాబ్ధంలోనే అత్యంత శ‌క్తివంత‌మైంది. ఒక్క ఒక్సాకా రాష్ట్రంలోనే 45 మంది, చైపాస్‌లో మ‌రో 12 మందితో మొత్తం 61 మంది చనిపోయారు. 
                      క‌రీబియ‌న్ దీవుల‌ను దారుణంగా దెబ్బ‌తీసిన హ‌రికేన్ ఇర్మా ఇప్పుడు క్యూబాపై విరుచుకుప‌డింది. దీంతో అక్క‌డ అత్యంత బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వ‌ర్షాలు కురిసాయి. అర్చిపెలాగో దీవిపైన కూడా ఇర్మా ప్ర‌భావం చూపింది. అయితే ఇర్మా ట్రాక్ త‌ప్ప‌డంతో బ‌హ‌మాస్ దాదాపు భారీ విప‌త్తు నుంచి బ‌య‌ట‌ప‌డింది. మ‌రోవైపు అమెరికాలోని ఫ్లోరిడాపై ఇర్మా ప్ర‌భావం చూపే అవ‌కాశాలున్నాయి. సుమారు 60 ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలొచ్చాయి. ఇర్మా వ‌ల్ల క‌రీబియ‌న్ దీవుల్లో సుమారు 20 మంది మృతిచెందిన‌ట్లు అంచ‌నా. కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత అయిద‌వ ప్ర‌మాద హెచ్చ‌రిక క‌లిగిన హ‌రికేన్ క్యూబాను తాకింది. ఇర్మా వ‌ల్ల గంట‌ల‌కు 257 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. క్యూబాలోని కైబేరియ‌న్ ప‌ట్ట‌ణానికి 190 కిలోమీట‌ర్ల దూరంలో ఇర్మా కేంద్రీకృత‌మైంది. ఒక వేళ ఇది తీరం దాటితే పెను విధ్వంసం రావ‌డం ఖాయ‌మ‌ని నాసా హెచ్చ‌రించింది. ఇర్మా క‌ద‌లిక‌ల‌ను రికార్డును చేసిన నాసా శాస్త్ర‌వేత్త‌లు.. ఫ్లొరిడా తీరంలో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉన్న సంగతులను బయట పెట్టింది. ఫలితంగా భయం నీడలో జనాలు మగ్గుతున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*