ఇర్మా హరికేన్ తో బాధితులైన తెలుగువారు 



Want create site? Find Free WordPress Themes and plugins.
        ఇర్మా హరికేన్‌ ప్రభావం తెలుగువారి మీద పడింది. ముందస్తు హెచ్చరికలతో ఇప్పటికే వేల సంఖ్యలో తెలుగు కుటుంబాలు ప్లోరిడాను ఖాళీ చేశాయి. సురక్షిత ప్రాంతాలకు వారు తరలి వెళ్లారు. ఒక్క ఫ్లోరిడాలోనే దాదాపు ఆరు వేల వరకు తెలుగు కుటుంబాలున్నాయి. తీర ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో అక్కడి అధికారులు ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించడంతో మిగతా వారితో పాటు..తెలుగు వాళ్లు మరో ప్రాంతానికి తరలి వెళ్లారు. నిరాశ్రయులైన తెలుగు ప్రజలకు ఇతర రాష్ట్రాలు, నగరాల్లోని తెలుగువారు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరిడా నుంచి దాదాపు వెయ్యి తెలుగు కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లినట్టు సమాచారం. హర్వే తుపాన్ వచ్చిన సమయంలోను తెలుగువారు బాధితులకు అండగా నిలిచారు. ఏపీ ఎన్ ఆర్టీతో పాటు..స్థానిక సంస్థలు వారికి బాసటగా నిలిచాయి. సి.ఎం చంద్రబాబునాయుడు ఈ విషయం పై ఆరా తీశారు. 
        ఇర్మా తుపాన్ తో ఇబ్బంది పడుతున్న తెలుగు వారిని ఆదుకోవాలని ఎన్నారై తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. హర్వే హరికేన్ వచ్చినప్పుడు ఇలానే చంద్రబాబు జాగ్రత్తలు సూచించిన సంగతి తెలిసిందే. అంతే కాదు..చాలా తెలుగు అసోసియేషన్లు బాధితుల కోసం అనేక సహాయ చర్యలు తీసుకుంటున్నాయి. వారికి ఆహారం అందిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇర్మా హరికేన్ విరుచుకుపడటం అమెరికా చరిత్ర గతినే మారుస్తోంది. ముందస్తుగా హరికేన్ విలయాన్ని అంచనా వేసినా..ఇంకా ఎక్కువ నష్టం ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో హఠాత్తుగా వచ్చే టోర్నడోలు (సుడిగాలులు) పలు ప్రాంతాలను చుట్టుముడుతున్నాయి. ఫలితంగా ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు అమెరికా ప్రజలు భయపడుతున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*