ఆకట్టుకున్న జై లవకుశ ట్రైలర్



Want create site? Find Free WordPress Themes and plugins.
ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ‘ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’ అని ఎలుగెత్తాడు ఎన్టీఆర్‌’. యంగ్ టైగర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’. ఇందులో ఆయన ‘జై’, ‘లవ’, ‘కుశ’ పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఏ తల్లికైనా ముగ్గురు పిల్లలు పుడితే రామ, లక్ష్మణ, భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ, రామ, లక్ష్మణులు అయ్యారు’ అంటూ ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘నేను మహానటుడ్ని అని ఆడియన్స్‌లో పాజిటీవ్‌ రియాక్షన్‌ ఉంది రా. అలాంటి నన్ను మీ ఎదవ పర్ఫామెన్స్‌లు వేసి ఆడిటర్స్‌ ముందు ఇరికించేస్తారా.. రా?’ అంటూ ‘లవ’ పలికిన డైలాగ్‌ అదుర్స్. అన్ని పాత్రలు ఇరగదీసేలా ఉన్నాయి. ‘జై’ నటన, హావభావాలు, నత్తితో డైలాగ్‌లు పలికిన విధానం బాగుంది. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. తమన్నా ప్రత్యేక గీతంతో ఆక్టటుకోనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబరు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫలితంగా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకున్నాయి. 

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*