వ్యాపారమే కాదు..కాస్త శాఖనూ చూడాలన్న చంద్రబాబుWant create site? Find Free WordPress Themes and plugins.
     ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి సిద్దా రాఘవరావుకు సి.ఎం చంద్రబాబునాయుడు చిన్నపాటి పంచ్ ఇచ్చారట. మీరు వ్యాపారం బాగా చేస్తారు. కాస్తంత శాఖ మీద కూడ దృష్టి పెట్టండని చెప్పారట. మంత్రి మండలి సభ్యుల ముందే చంద్రబాబు ఈ మాట చెప్పడంతో రాఘవరావుకు అసలు విషయం బోధపడిందట. నీరు-చెట్టు కార్యక్రమంతోపాటు..పచ్చదనం పరిశుభ్రత మీద ఎక్కువగా దృష్టి పెట్టారు చంద్రబాబునాయుడు. ఆ శాఖకు కీలక బాధ్యతలు అప్పగించినా అనుకున్న మేర లక్ష్యం సాధించడం లేదనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాఘవరావుకు తన శాఖ సంగతి గుర్తు చేశారంటున్నారు.  
      గతం కంటే అటవీ సంపద తరిగిపోతోంది. మొక్కల శాతం తగ్గుతోంది. ఫలితంగా పర్యావరణానికి ఇబ్బంది అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ రావాలి. 5కోట్లమంది ప్రజలు ఉత్సాహంగా వనం-మనం కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. హరిత ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం రూపొందాలని’ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్ష. నాటిన ప్రతిమొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని, టీంలీడర్లు ఎప్పటికప్పుడు దాని పెరుగుదలను పరిశీలిస్తూ నాటిన అన్ని మొక్కలను సంరక్షించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్చందసంస్థల ద్వారా వాటికి ట్రీగార్డులు ఏర్పాటుచేయాలని కోరారు. ప్లాంటేషన్, పంట సంజీవని, సీసీ రోడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలన్నారు ముఖ్యమంత్రి. 
    నరేగా కింద ‘నీరు-చెట్టు’ పనులు వేగవంతం చేయాలన్నారు. సిమెంటు రోడ్లు, పంటసంజీవని, నీరు-చెట్టు తదితర పనులకు అందుబాటులో ఉన్న రూ.635 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నరేగా నిధులు రూ.8వేల కోట్లను పూర్తిగా వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. హార్టీకల్చర్ పనులు మరింత వేగవంతం కావాలని ఆదేశించడంతో పనుల వేగం పుంజుకుంది. ఇప్పటికైనా సిద్దా రాఘవరావు అసలు విషయం తెలుసుకుని పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారేమో చూడాలి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

  1. sidda, kamineni iddaru wastey. prabhuthva aasupathrulapai enni varthalocchina aarogyamanthriki yemi pattadu. yeppudo andariki cheppi aasupathri AC roomulo nidrachesi vasthuntadu.

Leave a Reply

Your email address will not be published.


*