తెలుగు సి.ఎం ల పిల్లలు ఆ పీఠం ఎందుకు ఎక్కలేదు



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులెవరు ఆ సీటు మీద కూర్చో లేదు. సచివాలయ వాస్తు సరిగా లేక పోవడమే ఇందుకు కారణమనే వాదనుంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ ను అక్కడ నుంచి మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది. బైసన్ పోలో గ్రౌండ్ కోసం కేసీఆర్ చాలా పెద్ద ప్రయత్నమే చేశారు. రక్షణ మంత్రి నుంచి, ప్రధాని మోడీ వరకు చాలా సార్లు కలిసి.. ఆ విషయాన్ని ప్రస్తావించారు. చివరకు విజయం సాధించారు. బైసన్ పోలో గ్రౌండ్ లోని 36 ఎకరాల రక్షణ భూములను తెలంగాణకు ఇచ్చినందుకు గాను కేంద్ర ప్రభుత్వం కోరుకున్న చోట 518 ఎకరాల భూములను ఇవ్వనుంది కేసీఆర్ ప్రభుత్వం. అంతే కాదు… రూ.90 కోట్లను కేసీఆర్ సర్కారు నజరానాగా చెల్లించనుంది. 
             ఈ విషయంలో కేసీఆర్ తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులు పని చేశారు. సి.ఎం కేసీఆర్ తో 17 మంది ముఖ్యమంత్రులు హైదరాబాద్ లోని సచివాలయం నుంచే పరిపాలన అందించారు. వారి పుత్రరత్నాలు ఎవరూ ముఖ్యమంత్రులుగా పని చేయలేదు. కొంతమందికి పదవి దగ్గరకు వచ్చినట్లే వచ్చి చేజారిన ఉదంతాలు ఉన్నాయి. తన తర్వాత కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాలనేది కేసీఆర్ కోరిక. అందుకే సచివాలయాన్ని అక్కడ నుంచి మారిస్తే మంచిదని కొందరు జ్యోతిష్యులు సలహానిచ్చారట. ఆ మాటలను నమ్మిన కేసీఆర్ సెక్రటేరియట్ మార్చేందుకు సిద్దమయ్యారనే ప్రచారం సాగుతోంది. మీ కుమారుడు కోసం ఇలా చేస్తారా అంటూ విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. మూడనమ్మకాల కోసం కొత్త సచివాలయాన్ని బైసప్ పోలో గ్రౌండ్ లో నిర్మించడానికి సిద్దం అవుతున్నారని తెలంగాణ టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లాంటి వారు నిప్పులు చెరిగారు. సి.ఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపికైంది. 
        మొదట్లో సచివాలయానికి బాగా వచ్చే కేసీఆర్ ఇప్పుడు అటువైపు రావడమే లేదు. రాష్ట్ర విభజన జరిగాక తొలిగా చంద్రబాబునాయుడు అక్కడ అడుగు పెట్టినా ఆ తర్వాత కొన్ని వాస్తు మార్పులు చేయించారు. చివరకు అక్కడ నుంచి మకాంను అమరావతి రాజధానికి మార్చారు. వాస్తుదోషం కోసం కేసీఆర్ కొన్ని రకాలు పూజలు చేయించారని తెలుస్తోంది. ఎన్ని రకాల పూజలు చేసినా కష్టమని… అక్కడ నుంచి అసలు సచివాలయాన్ని మార్చాలని కొందరు జ్యోతిష్యులు సూచించారనే ప్రచారం జరుగుతోంది. వారి మాట ప్రకారమే కేసీఆర్ ముందుకు వెళుతున్నాడని గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*