ఆకట్టుకున్న కుశ టీజర్



Want create site? Find Free WordPress Themes and plugins.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని జై, లవకుమార్ అనే పాత్రలకి సంబంధించిన టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కుశ టీజర్ విడుదలైంది. కుశ క్యారెక్టర్ చాలా సరదాగా ఉంది. ఎన్టీఆర్ ఈ పాత్రలో చాలా వయోలెంట్ గా కూడా ఉన్నాడనే చర్చ మొదలైంది. జై పాత్ర సీరియస్ గా ఉండగా, లవ కుమార్ పాత్ర కూల్ కూల్ గా ఉంది. ఇక ‘కుశ’ ఫస్టులుక్ తో పాటు… ‘కుశ’ పాత్రకి సంబంధించిన టీజర్ ను విడుదలైంది. కామెడీ.. యాక్షన్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. ఎన్టీఆర్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. జై.. లవ  పాత్రలకి పూర్తి భిన్నంగా పిలకతో ఆకట్టుకునేలా ఈ పాత్ర కనిపిస్తోంది. ‘కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదుర్స్. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
           ఎన్టీఆర్బా-బి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మిస్తుండగా… దేవిశ్రీ సంగీతం అందించారు. ఈ నెల 10న ప్రీ–రిలీజ్‌ వేడుక జరగనుండగా… 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ తో రాశీఖన్నా, నివేదితాథామస్, రోనిత్ రాయ్ లు జోడిగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక గీతంతో మెరుపులు మెరిపించనుంది. కోన వెంకట్ కథ అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రపీ చూస్తున్న ఈ మూవీ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*