ముంబై పేలుళ్ల సూత్రధారులకు శిక్ష ఖరారు



Want create site? Find Free WordPress Themes and plugins.
ముంబై పేలుళ్ల కేసులో దోషులకు టాడా కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబూ సలేంకు జీవిత ఖైదు, మరో నలుగురికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది. అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్ స్టర్‌ అయిన సలేంను పోర్చుగల్ నుంచి భారత్‌ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడి చట్టాల్లో మరణశిక్ష లేదు. అందుకే జీవిత ఖైదు విధించింది. మరో ఇద్దరు నిందితులైన తెహీర్ మర్చంట్, ఫెరోజ్‌ ఖాన్‌ లకు మరణ శిక్షలను ఖరారు చేసింది. కరీముల్లా ఖాన్‌ కు యావజ్జీవ శిక్ష, రియాజ్‌ సిద్ధిఖీకి 10 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు చెప్పింది. 
                  కేసు ప్రధాన సూత్ర ధారి ముస్తఫా దోసా జైల్లోనే మృతి చెందాడు. భారత్‌కు ఆర్డీఎక్స్‌ను తీసుకువచ్చి… పేలుళ్లుకు కుట్ర పన్నిన వారిలో కీలక సూత్రధారి ముస్తఫానే. ఆయుధాలను గుజరాత్‌ నుంచి ముంబైకి తరలించిన వాడు అబూ సలేం ప్రధాన నిందితుడు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు కూడా 1993 జనవరి 16న సలేం ఏకే 56 ఆయుధాలతోపాటు 250 రౌండ్ల బుల్లెట్లు, కొన్ని గ్రనేడ్లను అందించాడు. తిరిగి జనవరి 18న సంజయ్‌దత్‌ ఇంటికొచ్చి వీటిని అబూసలేం తీసుకెళ్లాడు. 
                 పాకిస్తాన్‌కు ఉగ్ర శిక్షణకు వెళ్లాల్సిన యువకులను గుర్తించి వారిని పురికొల్పింది తాహిర్ మర్చంట్ నే. భారత్‌లో అక్రమంగా ఆయుధ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులను సేకరణ చేసింది అతనే. ఆయుధాలను తీసుకోవటంలో కస్టమ్స్‌ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి.. వాటిని జాగ్రత్తగా అనుకున్న లక్ష్యాలకు చేర్చింది ఫిరోజ్‌ అబ్దుల్‌ ఖాన్‌. అబూసలేం ఆయుధాలు తరలించేందుకు వాహనాన్ని సమకూర్చింది రియాజ్‌ సిద్దిఖీ. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో దాచిన ఆయుధాలు, డిటోనేటర్లు, గ్రనేడ్లను సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు కరీముల్లా ఖాన్‌. దుబాయ్‌ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ శిక్షణ పొందాడు. మొత్తంగా వీరంతా ముంబై పేళ్లుల్లో 257 మంది మృతికి కారణమయ్యారు. 
ఎప్పుడు ఆ సంఘటనలు జరిగాయంటే…
12 మార్చి, 1993 : గంట వ్యవధిలో 13 చోట్ల బాంబులు పేలి 257 మంది మృతి, 713 మందికి గాయాలు.
19 ఏప్రిల్, 1993 : ఏకే–56 రైఫిల్‌ను, 9ఎంఎం పిస్టల్‌ను, తూటాలను అక్రమంగా కలిగి ఉన్నాడనే అభియోగంపై సినీనటుడు సంజయ్‌దత్‌ అరెస్టు. 15 రోజులకే బెయిల్‌పై విడుదల.
4 నవంబరు 1993 : ముంబై క్రైం బ్రాంచ్‌ ప్రాథమిక చార్జిషీట్‌ దాఖలు. 189 మందిపై అభియోగాలు. 117వ నిందితుడిగా సంజయ్‌దత్‌.
19 నవంబరు 1993 : ఈ కేసు సీబీఐకి అప్పగింత.
10 ఏప్రిల్‌ 1994 : 26 మందిని నిర్దోషులుగా తేల్చిన టాడా ప్రత్యేక కోర్టు.
ఏప్రిల్‌ 1995 – సెప్టెంబరు 2003 : టాడా కోర్టులో విచారణ. అప్రూవర్లుగా మారిన నిందితులు మహ్మద్‌ జమీల్, ఉస్మాన్‌ జానకనన్‌.
జూన్‌ 13 2003 : అబూసలేం, ముస్తఫా దోసా సహా ఏడుగురు నిందితులను ప్రధాన కేసునుంచి వేరుచేసి.. విచారణ జరపాలని కోర్టు నిర్ణయం.
సెప్టెంబరు 12 2006 : టాడా కోర్టు తీర్పు.. యాకూబ్‌ మెమన్‌తో సహా 12 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు
31 జులై, 2007 : సంజయ్‌దత్‌కు ఆరేళ్ల జైలుశిక్ష
21 మార్చి 2013 : యాకూబ్‌ మెమన్‌కు మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీంకోర్టు. మరో 10 మంది మరణశిక్ష.. యావజ్జీవ కారాగారశిక్షగా మార్పు.
29 జులై 2015 : యాకూబ్‌ మెమన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.
30 జులై 2015 : నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో యాకూబ్‌ మెమన్‌కు ఉరి అమలు
25 ఫిబ్రవరి 2016 : సత్ప్రవర్తన కారణంగా 8 నెలల శిక్ష తగ్గి జైలునుంచి సంజయ్‌దత్‌ విడుదల.
16 జూన్, 2017 : అబూసలేంతో సహా మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చిన టాడా కోర్టు.
07, సెప్టెంబర్, 2017 : ముస్తాఫా చనిపోవటంతో మిగిలిన దోషులకు శిక్షలు ఖరారు 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*